Khammam : వరద బాధితులకు రూ.10వేలు, పశువులకు రూ.50 వేలు.. రేవంత్ తక్షణ సాయం!

ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. బాధిత కుంటుంబాలకు రూ.10వేలు, చనిపోతే రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. పశువులకు రూ.5నుంచి 50 వేలుతక్షణ సాయం అందిస్తామన్నారు. లక్షకోట్లు దోచుకున్న కేసీఆర్ ఫ్యామిలీ ఆర్థిక సాయం చేసి పాపాలు కడుక్కోవాలన్నారు.

New Update
Khammam : వరద బాధితులకు రూ.10వేలు, పశువులకు రూ.50 వేలు.. రేవంత్ తక్షణ సాయం!

Revanth Reddy : ఖమ్మం (Khammam) వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధిత కుంటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10వేలు అందిస్తామని చెప్పారు. ఆవు, గేదెలు మరణిస్తే రూ.50వేలు, గొర్రె, మేకలకు రూ.5వేలు ఇస్తామన్నారు. ఇళ్లకు నష్టం జరిగితే పీఎం ఆవాస్‌ యోజన (PM Awas Yojana) కింద ఆర్థికసాయం చేస్తామన్నారు. వరదల వల్ల ధ్రువపత్రాలు పోతే మళ్లీ ఇస్తామని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10వేలు పరిహారం ఇస్తామని, విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వరదల సమయంలో బురద రాజకీయాలు సరికాదని, ప్రతిపక్షాలు కూడా ప్రజలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు.

ఫామ్ హౌజ్ లో ప్రశాంతంగా ఉండొచ్చు..
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు వదలుకుని సాయం చేసేందుకు ముందుకురావాలి. ఒకవేళ మనకు సాయం చేయాలని లేకపోతే అన్ని మూసుకుని ఉండాలి. అంతేతప్పా పనులు చేస్తున్న వారిపై ఇంట్లో కూర్చొని బురదజల్లకూడదన్నారు. దేవుడు అలాంటి బుద్ధి మనకు ఇవ్వనప్పుడు ఫామ్ హౌజ్ లో ప్రశాంతంగా ఉండొచ్చు, లేదంటే విదేశాల్లో విలాసాలు చేయొచ్చు అంటూ కేసీఆర్, కేటీఆర్ (KTR) పై విమర్శులు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో మౌన ముద్ర వహించడం తనకు ఇప్పటికీ అర్థం కావట్లేదన్నారు. కేటీఆర్ ట్విట్టర్ లో మాత్రమే మాట్లాడుతాడని, అమెరికాలో లైఫ్‌ ఎంజాయ్ చేస్తూ ప్రజలల్లో ఉన్న మంత్రులను బద్నాం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో అందంరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు వచ్చే విషయంపై మాట్లాడాలన్నారు. కనీసం కష్టాల్లో ప్రజలను పలకరించే ప్రయత్నం చేయలేదన్నారు. మా ప్రభుత్వం కష్టాల్లో ప్రజలను ఆదుకుంటుందని, వాళ్లకు అండగా నిలబడుతుందని చెప్పారు.

పాపాలు కడుక్కోండి..
అలాగే సర్వం కోల్పోయిన ప్రజలను చూస్తే తనకు చాలా బాధేసిందని, వారికోసం ప్రత్యేకంగా 34 క్యాంపులు నిర్వహించి పనులు చేపట్టామన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలంగాణ (Telangana) లో పదేళ్లు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న కేసీఆర్, కేటీఆర్, హారీష్ రావు కనీసం వెయ్యికోట్లు ఇచ్చినా పాపాలు కడుకున్నవారు అవుతారు కదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామన్నారు.

Also Read : సింగ్‌నగర్‌లో ఆర్తనాదాలు.. ఆహారం లేక జనాల అవస్థలు

Advertisment
Advertisment
తాజా కథనాలు