AP - Telangana School Holidays : తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు పలు జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. మరో 2 రోజులపాటు భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.
నిండు కుండలా మారిన లోతట్టు ప్రాంతాలు..
ఈ మేరకు ఉమ్మడ ఖమ్మం జిల్లా (Khammam District) లోని చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు నీరు భారీగా చేరింది. ప్రాజెక్టు 14 గేట్లు పూర్తిగా ఎత్తి వేయగా.. మరో 6 గేట్లు 2 అడుగుల మేర నీరు చేరుకుంది. మొత్తం 20 గేట్లను ఎత్తి 66900 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 61799 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 81572 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 74 మీటర్లు. కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 71.92మీటర్లుగా ఉంది. భద్రాచలం దగ్గర గోదావరి వుదృతి వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 30.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంద. శుక్రవారం ఉదయం నుండి నేటి ఉదయం వరకు 15 అడుగుల మేర పెరిగింది. ఎగువ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోనూ వర్షాలు బాగా కురవడంతో తాలిపేరు నిండు కుండలా మారింది.
ఇక ఏపీలో 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు (School Holidays) ప్రకటించారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా, తూర్పు, శ్రీకాకుళం జిల్లాలో స్కూళ్లు మూతబడ్డాయి. ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలూరు జిల్లాలో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు కట్ట తెగడంతో వరద గ్రామాలను ముంచెత్తుతోంది. ధవళేళ్వరం దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఈ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి ప్రాణనష్టం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read : చారిత్రక అడుగుకు 55ఏళ్లు.. మూన్‌పై తర్వాత అడుగుపెట్టే మానవుడు ఎవరు?