/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/lowpressure.jpg)
Rain Alert : తెలంగాణ (Telangana) లో 4 నుంచి 11 జిల్లాల్లో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ క్రమంలోనే ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం వాయువ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. శనివారం నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
Today's Hyderabad Weather update.. #weatherupdate #Hyderabad #Rains #RTV pic.twitter.com/bcummsEgwd
— RTV (@RTVnewsnetwork) August 30, 2024
Today's Vijayawada Weather update.. #weatherupdate #vijayawada #RTV pic.twitter.com/m3wBncE07O
— RTV (@RTVnewsnetwork) August 30, 2024
Today's Vizag Weather update.. #weatherupdate #vizag #RTV pic.twitter.com/GA3iQ9cnxt
— RTV (@RTVnewsnetwork) August 30, 2024
శుక్రవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, శనివారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్, సిద్దిపేట, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
Also Read: పారా ఒలింపిక్స్‌లో అదరగొట్టిన ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి