Himachal Pradesh Landslides : అంతా అల్లకల్లోలం..పెరుగుతున్న మృతుల సంఖ్య...!!

హిమాచల్ ప్రదేశ్‎లో వరణుడు పగపట్టినట్లున్నారు. గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు తోడుగా ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం వాటిల్లుతోంది. ఇప్పుటివరకు మరణించిన వారి సంఖ్య 60కి చేరుకుంది. మృతుల సంఖ్యా ఇంకా పెరుగుతూనే ఉంది. ఎక్కడ చూసినా విషాదఘటనలే కనిపిస్తున్నాయి. ఇళ్లు పేకమేడల్లా కూలిపోతున్నాయి.

Himachal Pradesh Landslides : అంతా అల్లకల్లోలం..పెరుగుతున్న మృతుల సంఖ్య...!!
New Update

Heavy rains in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాబోయే 24గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొండచరియలు విరిగిపడటం, వరదలు, మేఘాల విస్పోటనాల కారణంగా అపారమైన ఆస్తితోపాటు ప్రాణనష్టం వాటిల్లింది.

మరోవైపు ఆగస్టు 16, 17 తేదీల్లో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఉరుములు, తుఫానుల కారణంగా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితులు త్వరలో మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

మంగళవారం సిమ్లాలో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి, అనేక ఇళ్లు కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు (Sukhvinder Singh Sukhu)ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)ఆర్మీతో పాటు పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) మంగళవారం ఉదయం 6 గంటలకు సమ్మర్ హిల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లను తిరిగి ప్రారంభించినట్లు సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేగి తెలిపారు .

-మంగళవారం సిమ్లాలోని శివాలయం కూలిపోయిన ప్రదేశం నుంచి మరో మూడు మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా మరిన్ని మృతదేహాలు చిక్కుకుపోయి ఉంటాయని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం నుంచి వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో 60 మంది మరణించారని ముఖ్యమంత్రి సుఖు తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం నాటి కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో సోమవారం 51 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

-తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఉటంకిస్తూ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బుధవారం అన్ని విద్యా సంస్థలను మూసివేయనున్నట్లు తెలిపారు.

-హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, ఫతేపూర్, ఇండోరా, కాంగ్రా జిల్లాల్లో వరద సహాయక చర్యల కోసం ఇండియన్ ఆర్మీ కాలమ్‌లు (Indian Army Column) ఉపయోగిస్తున్నారు. కాలమ్‌లు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

-ఐఎండి (IMD) ప్రకారం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, పౌరీ, టెహ్రీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

-ఉత్తరాఖండ్‌లోని వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

-బద్రీనాథ్ జాతీయ రహదారి గడోరా, తంగ్ని, గులాబ్‌కోటి, బల్దౌడాతో సహా నాలుగు పాయింట్ల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. చార్ధామ్ యాత్ర రెండో రోజు కూడా నిలిచిపోయింది.

-పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో రాబోయే 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.

Also Read: మరో కీలక ఘట్టానికి వేళాయే.. చంద్రునికి దగ్గరకు చంద్రయాన్-3..!!

#uttarakhand-floods #uttarakhand-rains #heavy-rains-in-himachal-pradesh #himachal-pradesh-landslides #heavy-rain-wreaks-havoc-in-uttarakhand #himachal-cloudburst #himachal-landslides #himachal-pradesh-rains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe