Hyderabad Rain: హైదరాబాద్‌లో కుండపోతగా వాన.. పలు ప్రాంతాలు జలమయం! హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లితోపాటు పలు ప్రాంతాలు జలయమం అయ్యాయి. మరో 2 గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వానకు తడుస్తూనే గణపతికి పూజలు చేస్తున్నారు భక్తులు. By srinivas 08 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad Rain: హైదరాబాద్ నగరంలో మరోసారి కుండపోత వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాన జోరందుకుంది. దీంతో పలు ప్రాంతాలు మాదాపూర్, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి జలమయం అయ్యాయి. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఆబిడ్స్, కోటి, ఎల్‌బీ నగర్, ఉప్పల్‌లోనూ భారీ వర్షం పడుతోంది. గణేష్ మండపాల దగ్గర వర్షంలో తడుస్తూనే భక్తుల పూజలు నిర్వహిస్తున్నారు. ఇక మరో 2 గంటలపాటు భారీ వర్షం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే ఇళ్లనుంచి బయటకు రావాలని సూచించింది. #heavy-rain #hyderabad #madhapur #uppal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి