Karnataka: కర్ణాటకలో భారీ వర్షం..నీట మునిగిన పలు ప్రాంతాలు!

నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న కర్ణాటక ప్రజలు కాస్త చల్లబడ్డారు. చాలా రోజుల తరువాత కర్ణాటకలో భారీ వర్షం కురిసింది. దీంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. రాష్ట్రంలో చాలా కాలం నుంచి ప్రజలు తాగు నీటికి నానా కష్టాలు పడుతున్నారు.

New Update
Weather Alert : రాగల రెండ్రోజుల పాటు వర్షాలు..

Karnataka: నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న కర్ణాటక ప్రజలు కాస్త చల్లబడ్డారు. చాలా రోజుల తరువాత కర్ణాటకలో భారీ వర్షం కురిసింది. దీంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. రాష్ట్రంలో చాలా కాలం నుంచి ప్రజలు తాగు నీటికి నానా కష్టాలు పడుతున్నారు. బెంగళూరులో అయితే నీటి కష్టాలు తీవ్రం అయ్యాయి.

కనీస అవసరాలకు కూడా నీళ్లు లేక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో వాన పడడంతో కన్నడ వాసుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. గురువారం సాయంత్రం రాష్ట్రంలోని శివమొగ్గ, తీర్థహళ్లి, సాగరలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయమయ్యాయి.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు గత కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వాన కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆశ్వాదించారు. మరోవైపు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ వాన నీరు భూమిలోకి చేరి బోర్ల నుంచి నీరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also read: రెండంతస్తుల భవనం కూలి.. ఐదుగురి మృతి!

Advertisment
తాజా కథనాలు