Weather Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెడ్‌ అలెర్ట్ జారీ

రానున్న 2 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే సైబరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోందని.. ఆ తర్వాత నగరవ్యాప్తంగా ఇది విస్తరిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. మరో 1-2 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. ఇప్పటికే సైబరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోందని.. ఆ తర్వాత నగరవ్యాప్తంగా ఇది విస్తరిస్తుందని పేర్కొంది. గురువారం లాగే ఈరోజు కూడా భారీ వర్ష ప్రభావం ఉంటుందని తెలిపింది. బయటకి ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

Also Read: రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..అత్యవసరం అయితేనే బయటకు రండి!

ఇదిలాఉండగా తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం , శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. శుక్రవారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట,ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం రేపు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు