National: హిమాచల్‌ను ముంచెత్తుతున్న వర్షాలు..బీహార్‌లో పిడుగులు

హిమాచల్ ప్రదేశ్, బీహార్లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్‌లో కాంగ్రా జిల్లాలోని ధర్మశాలలో అత్యధికంగా 214.6మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు పిడుగుల కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు.

National: హిమాచల్‌ను ముంచెత్తుతున్న వర్షాలు..బీహార్‌లో పిడుగులు
New Update

Himachal Pradesh and Bihar: బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల ఈదురు గాలులతో పాటు పిడుగులు కూడా పడ్డాయి. వీటి కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో జహనాబాద్‌, మాదేపుర, ఈస్ట్‌చంపారన్‌, రోహ్‌తాస్‌, సరాన్‌, సుపౌల్‌ జిల్లాలు ఉన్నాయి. జహనాబాద్‌ జిల్లాలో ముగ్గురు, మాదేపుర జిల్లాలో ఇద్దరు, ఈస్ట్‌ చంపారన్‌, రోహ్‌తాస్‌, సరాన్‌, సుపౌల్‌ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాట్లకు బలయ్యారు. ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించారు. ప్రజలు విపత్తు నిర్వహణ విభాగం అధికారుల సూచనలు పాటించాలని సీఎం సూచించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌ను వర్సాలు ముంచెత్తుతున్నాయి. కాంగ్డా జిల్లాలోని ధర్మశాల , పాలాంపుర్‌లో 200మి.మీ కంటే ఎక్కువ వర్షం కురిసింది. ధర్మశాలలో అత్యధికంగా 214.6మి.మీ వర్షపాతం నమోదు కాగా.. పాలాంపుర్‌లో 212.4మి.మీ, జోగీందర్‌ నగర్‌లో 169 మి.మీ, కాంగ్డా పట్టణంలో 157.6మి.మీ, బైజ్యనాథ్‌లో 142 మి.మీ, జోత్‌లో 95.2 మి.మీ, నగ్రోటా సూరియన్‌లో 90.2 మి.మీ, సుజన్‌పుర్‌లో 72 మి.మీ, ధౌలకాన్‌లో 70 మి.మీ, ఘమ్‌రోర్‌లో 68.2 మి.మీ, నాదౌన్‌లో 63 మి.మీ, బెర్తిన్‌లో 58.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జూలై 12వరకు ఇలానే ఉంటుంది అంట వాతావరణశాఖ అరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

హిమాచల్‌లో వర్షాల కారణంగా చాలాచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కారణంగా అధికారులు 150 రహదారులను మూసేశారు. మండి జిల్లాలో 111, సిర్‌మౌర్‌లో 13, శిమ్లాలో 9, చంబా, కులులో 8, కాంగ్డాల్లో రోడ్లు క్లోజ్ చేశారు. మరోవైపు వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాను అతి భారీ వర్షపాతంగా పరిణిస్తోంది వాతారణశాఖ.

Also Read:Uttara Pradesh: హత్రాస్‌ కేసులో ప్రధాన ముద్దాయి అరెస్ట్‌ – ఎస్పీ నిపుణ్

#rains #thunders #bihar #himachal-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe