Heavy rain: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. కాకినాడలో పిడుగు పాటు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజనగరం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, తుని ప్రాంతాల్లో వర్షం కురిసింది.

New Update
Heavy rain: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.. కాకినాడలో పిడుగు పాటు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజనగరం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, తుని ప్రాంతాల్లో వర్షం కురిసింది. సామర్లకోటలో సుమారు మూడు గంటలపాటు భారీ వర్షం కురువడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు వరద అధికంగా రావడంతో సామర్లకోట బస్టాండ్‌ నీట మునిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వాహనదారులు సరిగ్గాకి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం దంచికొట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాకినాడ పట్టణంలో నువ్వుల వర్షం కురిసింది. మరోవైపు కాకినాడ 2వ డివిజన్‌లోని సచివాలయం సమీపంలో తాటి చెట్టుపై పిడుగు పడటంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో ఆర్థంకాక భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ ఉరుములతో వర్షం పడుతుండటంతో పిడుగు ఎక్కడ పడుతుందో తెలియక కాకినాడ వాసులు భయంతో వణికిపోతున్నారు.

మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని సచివాలయ సిబ్బంది స్థానికుల సహాయంతో రక్షించారు. ఇళ్లలోకి వరద నీరు చేరిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలలు 2 మీటర్ల ఎత్తున ఎగిసి పడుతున్నాయి. మరోవైపు రానున్న మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది

Advertisment
Advertisment
తాజా కథనాలు