Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లాలో నేడు మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఇరువురి మధ్య గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. కాల్పుల అనంతరం ఘటనా ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం చనిపోయిన మావోస్టుల మృతుల వివరాలు, శవాలను అధికారులు మీడియా ఎదుట వెల్లడించారు. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు పీడియా అటవీ ప్రాంతంలో సమావేశమైయ్యారని పోలీసులకు ఉన్న సమాచారంతో.. పిడియా అటవీ ప్రాంతానికి 1000 మంది పోలీసులు కూంబింగ్‌కు వెళ్లారు. ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో డీ.ఆర్.జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా, ఎస్టిఎఫ్, బస్తర్ ఫైటర్స్, బస్తరియా బెటాలియన్ బలగాలు పాల్గొన్నారు. ఎస్పీ జితేంద్ర యాదవ్ మీడియాకి వివరించారు.
ఇది కూడా చదవండి: న్యాయం కోసమే విజయమ్మ పోరాటం..న్యాయానికి ఓటు వేస్తారని ఆశిస్తున్నా: వైఎస్ సునీత