Weather Alert : వేసవి కాలం.. వివిధ ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం..

వేసవి కాలం మొదలైనప్పటికీ.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

New Update
Weather Alert : వేసవి కాలం.. వివిధ ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం..

Summer Season : వేసవి కాలం మొదలైనప్పటికీ.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు(Rains) పడుతున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ(Department of Meteorology) పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్‌(Heat Wave) హెచ్చరికలు జారీ చేసింది. గత వారంలో ఉత్తర, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొంది. ఇక ఢిల్లీ(Delhi) లో ఈ వారంలో 38 డిగ్రీల సెల్సియస్‌ దాటుతుందని తెలిపింది. అలాగే తూర్పు భారత్‌ వైపు 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగతాయని చెప్పింది.

Also Read: ఎన్నికల వేళ స్టార్‌ హిరోల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్..

మరోవైపు భారత్‌లో హీట్‌వేవ్‌ పరిస్థితులు పెరుగుతున్నాయని.. రాబోయే 4-5 రోజుల్లో ఇవి మరింత ఉద్ధృతం అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా ఆ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ఒడిశాలో ఆదివారం గరిష్ఠంగా 44.6 డిగ్రీల ఉష్ణో్గ్రత నమోదైంది. దీంతో ఆ రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. బీహార్, జార్ఖాండ్ రాష్ట్రాల్లో మరో ఐదురోజుల పాటు హీట్‌వేవ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎలాంటి హీట్‌వేవ్ పరిస్థితులు కనిపించడం లేదు. కానీ పలు రాష్ట్రాలకు వేడి, తేమ లాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. మరో నాలుగురోజుల పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు వేడి - తేమ వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌లో మంచు కురవడంతో ఆ రాష్ట్రానికి యెల్లో అలెర్ట్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 22, 23 తేదీల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉరములు, మెరుపులతో కూడిన వర్షం ఉంటుందని తెలిపింది. ఈ వేసవికి వివిధ ప్రాంతాల్లో వివిధ వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది.

Also Read: బెంగళూరులో ఖమ్మం ఎంపీ సీటుపై పంచాయితీ..!

Advertisment
తాజా కథనాలు