Heat Wave : ఢిల్లీలో దంచికొడుతున్న ఎండలు.. 15 మంది మృతి !

దేశరాజధాని ఢిల్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఓవైపు ఎండలు.. మరోవైపు నీటి సంక్షోభంతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 72 గంటల్లో వడదెబ్బతో 15 మంది మృతి చెందడం కలకలం రేపింది. ఢిల్లీలో 5గురు.. దీనికి సమీపంలో ఉన్న యూపీలోని నొయిడాలో 10 మంది మృతి చెందారు.

Heat Wave : ఢిల్లీలో దంచికొడుతున్న ఎండలు.. 15 మంది మృతి !
New Update

Delhi-NCR : దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. ఓవైపు ఎండలు (Heat Wave).. మరోవైపు నీటి సంక్షోభం (Water Crisis) తో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 72 గంటల్లో వడదెబ్బతో 15 మంది మృతి చెందడం కలకలం రేపింది. ఢిల్లీలో 5గురు.. దీనికి సమీపంలో ఉన్న యూపీలోని నొయిడాలో 10 మంది మృతి చెందారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీళ్లు ఆస్పత్రిలో వెంటిలేటర్‌ సపోర్ట్‌తో చికిత్స పొందుతున్నారు. వడదెబ్బల కేసుల్లో మరణాల రేటు 60 నుంచి 70 ఉందని వైద్యులు చెబుతున్నారు. రోగుల్లో చాలామంది కూలీలే ఉన్నట్లు పేర్కొన్నారు. ఎక్కువగా 60 ఏళ్లు దాటినవారే ఉన్నారని.. హీట్‌స్ట్రోక్‌ (Heat Stroke) పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Also Read: కల్తీమద్యం కలకలం.. ఐదుగురు మృతి

ఇదిలా ఉండగా.. గత నెలరోజులుగా ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. నగర గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు.. కనిష్ఠ ఉష్ణో్గ్రతలు 35 డిగ్రీల మర్కును కూడా దాటేశాయి. గతవారం నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లో వేడి గాలులు తీవ్రత పెరిగింది. ఇప్పటికే వాతావరణశాఖ అధికారులు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేశారు. మరోవైపు బిహార్, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌లో కూడా ఎండల తీవ్రత ఉంది. నార్త్‌ ఇండియా (North India) లో రాబోయే 24 గంటల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని.. ఆ తర్వాత దీని తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: విమానంలో ఆగిపోయిన ఏసీ.. ఉక్కపోతతో అల్లాడిన ప్రయాణికులు

#delhi #heatstroke #summer #telugu-news #heat-wave
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe