Heart Attack Sleeping Symptoms: ఇటీవలి కాలంలో మధ్య వయస్కులలో గుండెపోటు ఘటనలు భారీగా పెరుగుతున్నాయి. గుండె వైఫల్యం తీవ్రమైన పరిస్థితి. సెకన్ల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతారు. గుండె అనారోగ్యం కారణంగా రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేకపోతుంది. దీని వలన ఊపిరితిత్తులు, ఇతర కణజాలాలలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. తద్వారా వ్యక్తి అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే, గుండెపోటు లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మధ్య మారుతూ ఉంటాయి. గుండె వైఫల్యానికి సంబంధించి.. అనేక ప్రమాదకరమైన సంకేతాలు నిద్రలో ఎక్కువగా గుర్తించబడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ సంకేతాలేంటో ఓసారి చూద్దాం..
రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎదుర్కొనే 5 గుండెపోటు లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే, ఈ లక్షణాలు అందరికీ ఒకేలా ఉండకపోయినా.. వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు నిపుణులు.
1. శ్వాస ఆడకపోవడం..
పడుకున్నప్పుడు అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం నిద్రలో గుండె వైఫల్యం అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. మీరు లేచి కూర్చోవడం, దిండ్ల సహాయంతో ఊపిరి పీల్చుకోవడం, పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినట్లయితే.. ఈ పరిస్థితిని ఆర్థోప్నియా అంటారు.
2. పరోక్సిస్మల్ నాక్టర్నల్ డిస్ప్నియా (PND)..
గుండెపోటుతో బాధపడుతున్న వ్యక్తులు రాత్రిపూట తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటారు. దీన్నే paroxysmal nocturnal dispnea అంటారు. ఇది సాధారణంగా నిద్రపోయిన కొన్ని గంటల తర్వాత జరుగుతుంది. కూర్చోవడానికి లేదా నిలబడటానికి తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మానసిక చంచలత్వం ఉంటుంది.
3. దగ్గు, శ్వాసలోపం..
ఊపిరితిత్తులలో ద్రవం చేరడం వల్ల దగ్గు, గురకకు కారణమవుతుంది. ముఖ్యంగా రాత్రిపూట ఈ సమస్య పెరుగుతుంది. పింక్ కఫం కూడా సంభవించవచ్చు.
4. వేగవంతమైన హృదయ స్పందన..
గుండె వైఫల్యం వేగవంతమైన హృదయ స్పందనకు కారణమవుతుంది. ఇది నిద్రలో ముఖ్యంగా సాధారణం. ఇది ఒక వ్యక్తిని నిద్ర నుండి మేల్కొల్పుతుంది.
5. ఆకస్మిక మేలకువ..
గుండె ఆగిపోయిన చాలా సందర్భాలలో, ఛాతీ నొప్పి, నిద్ర నుండి ఆకస్మిక మేల్కొనడం జరుగుతుంది. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించుకుంటే ఆరోగ్యానికి చాలా ఉత్తమం.
Also Read:
స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియా,అఫ్ఘాన్ మ్యాచ్ సమయంలో ఏం జరిగిందంటే?
శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ