Chandrababu:ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగనుంది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌ వెంటనే విచారించాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Chandrababu:ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ
New Update

స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ల మీద విచారణ నేడు జరుగనుంది. దసరా సెలవు ల ప్రత్యేక బెంచ్ ముందు ఈ రోజు 8వ కేసుగా ఇది లిస్ట్ అయ్యింది. చంద్రబాబుకు స్కిన్ సమస్యతో పాటు కంటి సమస్యలున్నాయని ఆయన న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రబాబుకు ఎడమ కంటికి ఆపరేషన్ జరిగింది. మరో కంటికి వెంటనే ఆపరేషన్ చేయాలని చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో పాటు జైల్లో ఉండడం వలన ఆయన ఆరోగ్యం పాడయిందని.. ఇతర అనారోగ్య సమస్యలున్నాయని చెబుతున్నారు. ఇంతకు ముందు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ను నిరాకరించింది. దీంతో బాబు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. దీని మీద ఈ నెల 19న విచారణ జరిపిన హైకోర్టు...వెకేషన్ బెంచ్ కు కేటాయించింది. చంద్రబాబుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ లను కోర్టు ముందు ఉంచాలని రాజమండ్రి జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

Also Read:అంతరిక్షంలో కూడా రంగు, రుచి, వాసన..ఉంటాయా?

మరోవైపు స్కిల్ స్కామ్ కేసులో బాబును అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డింగ్ లను కోరుతూ ఆయన తరుఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఇంతకు ముందే ఈ కేసు విచారణకు వచ్చినప్పటికీ ప్రతివాదులను మెన్షన్ చేయకపోవడంతో మళ్ళీ పిటిషన్ వేయాలని జడ్జి సూచించారు. తిరిగి దాన్ని బాబు లాయర్లు ఫైల్ చేశారు. ఇది కూడా ఈరోజు విచారణకు రానుంది. ఇక బాబు పిటిషన్ మీద సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. అరెస్ట్ చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు కొంతమందితో ఫోన్ లో మాట్లాడారని... ఆ వివరాలు తెలిస్తే కీలక విషయాలు బయటపడతాయని అంటున్నారు చంద్రబాబు న్యాయవాదులు. అయితే ఇది తమ గోప్యతకు భంగం కలిగిస్తుందని...దాని ప్రభావం విచారణపై పడుతుందని సీఐడీ న్యాయవాదులు వాదిస్తున్నారు.

Also Read:విదేశీయులు మెచ్చే భారత్..అద్భుతాలకు నెలవు కోకోనట్ ఐలాండ్

#high-court #chandrababu #ap #skill-scam-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe