/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/White-Rice-4-jpg.webp)
Rice Advantages And Disadvantages: ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే ఆహారాలలో బియ్యం ఒకటి. వైట్ రైస్‌ని(White Rice) అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఉత్తర భారతదేశ ప్రజల కంటే.. దక్షిణ భారత దేశ ప్రజలు అధికంగా అన్నం తింటారు. ఆహార ప్రాధాన్యతలో రైస్‌దే మొదటి స్థానం. అయితే, అన్నం ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని కారణంగా శరీరానికి తగినంత పీచు అందదని, ఫలితంగా మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయని చెబుతున్నారు./rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/White-Rice-1-1024x576.webp)
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రజలు బియ్యం ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఇది ఆరోగ్యానికి హానీ తలపెడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మనం తినే ఆహారంలో తప్పకుండా తగినంత పీచుపదార్థం ఉండాలి. లేదంటే మలబద్ధకం వంటి అనేక సమస్యలు వస్తాయి. అందుకే మూడు పూటలా అన్నం తినడం మంచిది కాదు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/White-Rice-4-1024x576.webp)
శరీరానికి తగినంత ఫైబర్ అందకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది. పప్పులు, కూరగాయలు, గోధుమలు, శనగలు, మినుములను భోజనంలో చేర్చుకోవాలి. ఇవన్నీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వైట్ రైస్‌లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. అందుకే.. వైట్ ఎక్కువ తినడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/White-Rice-7-1024x576.webp)
అంతేకాదు.. వైట్ రైస్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అధిక కేలరీలు తీసుకోవడం వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వైద్యుల సలహా మేరకు అన్నం తీసుకోవడం మంచిది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/White-Rice-6-1024x576.webp)
ఇతర ధాన్యాలతో పోలిస్తే వైట్ రైస్‌లో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఈ పోషకాల లోపం ఎముకలు, దంతాలు, అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది. పోషకాహార లోపం అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. అలాగే అతిగా అన్నం తింటే రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/White-Rice-5-1024x576.webp)
తెల్ల బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారు వైట్ రైస్ తినకూడదని వైద్యులు చెబుతుంటారు. బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. వైట్ రైస్ తినడం వల్ల మధుమేహం వస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీలైనంత వరకు అన్నం తినకుండా ఉండాలి.
Also Read:
Follow Us