Health Problems : ఈ మధ్యకాలంలో చాలామంది ఊబకాయ సమస్యలను(Obesity Problems) ఎదుర్కొంటున్నారు. ప్రతి పదిమందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. శరీర బరువు తగ్గించుకునేందుకు(Body Weight Loss) చాలామంది వ్యాయమం చేస్తుంటారు. డైట్ పాటిస్తుంటారు. కానీ బరువు తగ్గేందుకు ఇవి సరిపోవని నిపుణులు చెబుతున్నారు. వాటికితోడు కంటినిండా నిద్ర కూడా ఉండాలని సూచిస్తున్నారు. సరైన నిద్ర ఉంటేనే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
Also Read: సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి.. అదిరిపోయే హిల్ స్టేషన్స్ ..!
చాలినంత నిద్ర లేకపోవడం బరువు పెరగడానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. నిద్రకు బరువుకు మధ్య ఉండే సంబంధం గురించి ఎన్‌మామి అగర్వాల్(Nmami Agarwal) అనే న్యూట్రిషనిస్ట్ పలు విషయాలు వెల్లడించారు. ప్రతిరోజూ వ్యాయామం(Exercise) చేసినా, డైట్ పాటించినా, మీరు బరువు తగ్గడం లేదంటే దానికి కారణం సరైన నిద్ర లేకపోవడమే అని అగర్వాల్ చెప్పారు. ' నిద్రలేమి కారణంగా శక్తి ఉత్పత్తి కోసం కొవ్వు కరగడానికి బదులుగా శరీరంలోనే పేరుకుపోతుంది. దీంతో మీ శరీరం కొవ్వులను కరిగించే శక్తిని కోల్పోతుంది. నిద్రలేమి అనేది ఒంట్లో కార్టిసార్ (ఒత్తిడి హార్మోన్ ) స్థాయిలు పెరిగేలా చేస్తుంది. ఇది పెరిగితే బరువు తగ్గే ప్రక్రియకు ఆటంకం ఎదురవుతుంది.
కార్టిసాల్ ఎక్కువైనప్పుడు మనం అవసరానికి మించి క్యాలరీలు తీసుకుంటాం. దీనివల్ల బరువు పెరుగుతాం. మనం తీసుకునే క్యాలరీలను కరిగించేటటువంటి శక్తి స్థాయినే జీవక్రియ రేటు అని అంటారు. ఈ జీవక్రియ రేటు అనేది ఎంత వేగంగా ఉంటే అంత సులభంగా బరువు తగ్గవచ్చు. సరైన నిద్ర లేకపోవడం వల్ల మన జీవక్రియ వేగం మందగిస్తుంది. దీనివల్ల బరువు తగ్గడం చాలా కష్టమవుతుందని ' అగర్వాల్ తెలిపారు.
Also Read: వైన్, బీర్ తాగుతే అందం పెరుగుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?