Age Gap Problems : వయసు(Age) తో పాటు వచ్చే చిన్న చిన్న సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. వయసు పెరిగేకొద్ది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టే సమయాన్ని కూడా పెంచుకోవాలి. ఇందుకోసం వ్యాయమం(Exercise) తో పాటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వయసు కారణంగా వచ్చే అనేక సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. వాస్తవానికి చాలామంది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు వ్యాయామం చేస్తుంటారు. కానీ అదే సమయంలో తగినంత విశ్రాంతి మాత్రం తీసుకోరు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం వేగంగా దెబ్బతినే అవకాశాలు ఉంటారు. రోగనిరోధక శక్తి కూడా క్రమంగా తగ్గుతుంది. అందుకే శరీరానికి వ్యాయామంతో పాటు విశ్రాంతి కూడా ప్రాధన్యమివ్వాలి.
Also read: మలబద్ధకంతో బాధపడుతున్నారా.. అయితే ఇది తీసుకోండి..
40 ఏళ్లు పైబడిన స్త్రీలకు రకరకాల ఆరోగ్య సమస్యలు(Health Problems) వస్తాయి. వీటినుంచి బయటపడేందుకు కొన్ని వ్యాయామాలు చేస్తారు. చాలామంది గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లే చేస్తుంటారు. అలా కాకుండా కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. లేదంటే ఎముకలు క్రమంగా బలహీనంగా అయిపోయి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణలో సరైన వర్కవుట్ చేయడం మంచింది.
వర్కవుట్‌ల వల్ల కండరాలు బలపడినప్పటికీ.. శరీరం ఫ్లెక్సిబిలిటీ కోల్పోతుంది. యోగా(Yoga), ధ్యానం చేయడం వల్ల ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకోవచ్చు. ఇక మరీముఖ్యమైనది పోషకాహారం. సరైన పోషకాహారం తీసుకోకపోతే అనుకున్న ప్రయోజనం లభించదు. డైట్ చార్ట్‌లో సంతులిత ఆహారం లేకపోతే అనేక సమస్యలకు దారీ తీయవచ్చు. క్రాష్ డైట్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండటం మంచింది. ప్రోటీన్లు, విటమిన్లు లభించే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే శరీరాన్ని ఎప్పుడూ కూడా హెడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
Also read: మీ కాలివేళ్ల మధ్య సందులు ఉన్నాయా..అయితే మీరు అదృష్టవంతులు!