Health Tips: చాలామంది ఉదయం లేవగానే.. టీ, కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఒక కప్పు టీ గానీ, కాఫీ గానీ తీసుకుంటేనే తప్ప, వారి రోజు సాగదు. ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తాగితే అలసట అంతా పోతుందని ఫీలవుతారు. ప్రతి సందర్భంలోనూ కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా తిన్న వెంటనే కాఫీ తాగే అలవాటు కొందరికి ఉంటుంది.
అయితే మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే ఈరోజే వదిలేయండి. అవును, తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Also Read:డిజిటల్ ప్రపంచానికి దూరంగా పిల్లలను పెంచడం ఎలా?
జీర్ణశక్తిని పాడు చేస్తాయి..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. తిన్న తర్వాత కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల ఆహారంలో ఉండే ప్రొటీన్లు సరిగా జీర్ణం కావు.
రక్తపోటు..
తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. కాఫీలో కెఫీన్ అనే మూలకం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. దీని కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. దీని వల్ల ఆహారంలోని పోషకాలు శరీరానికి సరిగా అందవు. తిన్న వెంటనే కాఫీ, టీ తాగకుండా ఉండేందుకే ప్రయత్నించాలి.
Also Read:చలికాలంలో శరీరాన్ని కాపాడే మెంతి
కాఫీ ఎప్పుడు తాగాలి..
టీ, కాఫీ తాగే అలవాటు ఉన్నవారు ఈ వ్యసనం నుండి బయటపడటం కొంచెం కష్టమే. అయితే, ఆహారం తిన్న ఒకటి, రెండు గంటల తరువాత కాఫీ తాగడానికి ప్రయత్నించండి. ఈ వ్యవధిలో మన శరీరం ఆహారం నుండి దాదాపు అన్ని రకాల పోషకాలను గ్రహిస్తుంది. ఆరోగ్య నిపుణులు కూడా ఆహారం తిన్న కొంత సమయం తర్వాత మాత్రమే కాఫీ, టీ తాగాలని సూచిస్తున్నారు.