Job Stress : ప్రతిఒక్కరికి ఒత్తిడి(Stress) రావడం అనేది సహజమే. ముఖ్యంగా ఆఫీసుల్లో, ఇంకా ఎక్కడైన పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే మానసిన ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు పనిచేసే ప్రదేశాల్లో చిన్న చిన్న మొక్క(Small Plants) లను పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. పనిప్రదేశాల్లో మొక్కలు పెంచితే.. చాలామంది ఒత్తిడిని జయించినట్లు జపాన్(Japan) లోని హ్యోగో యూనివర్సిటీ పరిశోధకుడు మసాహిరో అన్నారు. ఈ అధ్యయనంలో దాదాపు 63 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
Also Read: వాడిన నూనెలో వండిన ఆహారం ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం? తెలిస్తే షాకే!
ఉద్యోగుల డెస్క్(Employee Desk) వద్ద చిన్న మొక్కలను వారిలో జరుగుతున్న మార్పులను అధ్యయనం చేశారు. అలసట అనిపించినప్పుడు డెస్క్ వద్ద 3 నిమిషాల సేపు కూర్చోవాలని పరిశోధన బృందం సూచించింది. అయితే మొక్కలను చూశాక ఆ ఉద్యోగుల్లో ప్రశాంతత ఉండటంతో పాటు పనిలో వేగం పెరిగినట్లు తేలింది. అలాగే మొక్కలు లేని స్థలంలో కూడా ఉద్యోగుల పనితీరును గమనించగా.. ఇరువురి మధ్య చాలావరకు వ్యత్యాసం ఉన్నట్లు పరిశోధన బృందం గుర్తించింది. అందుకే పనిచేసే ప్రదేశాల్లో చిన్న చిన్న మొక్కలను పెంచితే ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.
Also Read: వీటిని ఒక గ్లాసులో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తాగండి.. రిజల్ట్ మీకే అర్థమవుతుంది.