Telangana : పోలీస్ శాఖలో విషాదం.. హెడ్‌ కానిస్టేబుల్ మృతి

తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్‌ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు పోలీస్ ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Head Constable : తెలంగాణ(Telangana) పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం(Road Accident) లో శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) అనే హెడ్‌ కానిస్టేబుల్ మృతి చెందారు. కొద్దిరోజుల పాటు ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన శ్రీనివాస్.. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. 1995 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్ గౌడ్.. గతంలో గంభీరావు పేట పోలీస్ స్టేషన్‌లో కూడా హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించారు.

Also Read: తెలంగాణలో ఐదు రోజుల్లో డేంజర్ ఎండలు .. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

అయితే ఇటీవలే కామారెడ్డి జిల్లా తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌కు శ్రీనివాస్ గౌడ్ బదిలీ అయ్యారు. శ్రీనివాస్ గౌడ్ సొంత గ్రామం రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) జిల్లాలోని ముస్తాబాద్. వారి కుటుంబం కామారెడ్డిలోనే స్థిరపడ్డారు. శ్రీనివాస్ గౌడ్‌ మృతి పట్ల ఎల్లారెడ్డి పేట రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డి పేట ఎస్.ఐ రమాకాంత్, గంభీరావుపేట ఎస్ఐ రామ్మోహన్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: ఖమ్మంలో పొంగులేటి Vs భట్టి.. ఎంపీ అభ్యర్థి పరిస్థితి ఏంటి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు