/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/HD-Revanna-arrested-1-jpg.webp)
Sex Scandal Case : గత కొన్ని రోజులుగా కర్ణాటక(Karnataka) లో దుమారం రేపుతున్న విషయం మాజీ ప్రధాని దేవెగౌడ కొడుకు, మనమడి సెక్స్ స్కాండల్(Sex Scandal). తండ్రీ కొడుకులు ఇద్దరూ చాలా మంది ఆడవాళ్ళను లైంగికంగా హింసచడమే కాకుండా వీడియోలు కూడా తీసి తమ పైత్యాన్ని బయటపెట్టుకున్నారు. తాజాగా ఈ వీడియోలు అన్నీ బయటకు రావడంతో వీరిద్దరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయాన్ని అక్కడ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సెక్స్ స్కాండల్ కేసుకు సంబంధించి సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) పరారీలో ఉన్నాడు. ఇతను జర్మనీలో ఉన్నాడని తెలిసింది. సిట్ అధికారులు ప్రజ్వల్ పాస్‌పోర్ట్ క్యాన్సిల్ చేయడమే కాక అతని మీద లుక్ అవుట్ నోటీసు కూడా జారీ చేశారు. అదలా ఉంటే...అతని తండ్రి హెచ్డీత రేవణ్ణను ఇక్కడ అరెస్ట్ చేశారు.
అరెస్ట్‌కు కూడా మంచి ముహూర్తం..
దేవెగౌడ కొడుకు హెచ్డీ రేవణ్ణ(HD Revanna) నిన్న సిట్ అధికారులకు లొంగిపోయారు. నిన్న సాయంత్రం 6.50 నిమిషాలకు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే సిట్ అధికారులు రేవణ్ణ ఇంటికి 5. 15ని.లకే వెళ్ళారు. కానీ రేవణ్ణ 5.17 నుంచి 6.50 వరకు మంచి సమయం కాదంటూ తలుపులు వేసుకుని కూర్చున్నారు. హెచ్‌డీ రేవణ్ణకు పూజలు, హోమాలు అంటే పిచ్చి. మంచి ముహూర్తాలు, రాహుకాలాలు చూసుకునే ఎక్కడికైనా వెళతారు. చేతిలోనో, జేబులోనే నిమ్మకాయ లేనిదే బయటకు కూడా వెళ్ళరు. ఇప్పుడు జైలుకు వెళుతున్నప్పుడు కూడా ఆయన అదే పని చేశారు. సిట్ అధికారులు బయట వెయిట్ చేస్తున్నా...అరెస్ట్ అవడానికి మంచి సమయం కాదంటూ తలుపులు వేసుకుని కూర్చున్నారు. అంతసేపూ ఇంట్లో పూజలు నిర్వహించారు. 6.50ని.లకు మంచి ముహూర్తం చూసుకుని బయటకు వచ్చి అధికారులకు లొంగిపోయారు హెచ్‌డీ రేవణ్ణ
Also Read:AP Elections 2024: ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన RTV.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?