Prajwal Revanna: ప్రజ్వల్‌ను దేవెగౌడే విదేశాలకు పంపించారు: సిద్ధరామయ్య

ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను ఇండియాకు తిరిగి రావాలని ఆయన తాతా, మాజీ ప్రధాని దేవెగౌడ ఓ లేఖ విడుదల చేయగా.. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. దేవెగౌడనే ప్రజ్వల్‌ను విదేశాలకు పంపించారంటూ ఆరోపించారు.

New Update
Prajwal Revanna: ప్రజ్వల్‌ను దేవెగౌడే విదేశాలకు పంపించారు: సిద్ధరామయ్య

లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన హసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఆయన తాతా, మాజీ ప్రధాని దేవెగౌడ.. రేవణ్ణను హెచ్చరిస్తూ ఇండియాకు తిరిగిరావాలంటూ ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అయితే తాజాగా దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. దేవెగౌడనే రేవణ్ణను విదేశాలకు పంపించారంటూ ఆరోపించారు. ఆయన సూచనలతోనే ప్రజ్వల్‌ జర్మనీకి వెళ్లారని అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకే ఆయన ఈ ప్రకటన చేశారంటూ విమర్శించారు.

Also read:  గ్రూప్ 1 అభ్యర్థులకు అలెర్ట్.. ఓఎంఆర్‌ పద్ధతిలో ప్రిలిమ్స్

మరోవైపు డిప్యూటీ సీఎం డే శివకుమార్‌ మాట్లాడుతూ.. ఇది పూర్తిగా దేవెగౌడ ఫ్యామిలీకి సంబంధించినదని.. అందులో తాను జోక్యం చేసుకోనని అన్నారు. చట్టం ప్రకారం విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం.. ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దీనిపై విచారణ చేపడుతోంది. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ పాస్‌పోర్ట్‌ను రద్దు చేసేందుకు కేంద్ర హోంశాఖ అవసరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఒకవేళ పాస్‌పోర్టును రద్దు చేసినట్లైతే ప్రజ్వల్ విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధం.

పోలీసులు ఇప్పటికే రెడ్‌కార్నర్, బ్లూకార్నర్‌ నోటీసులు.. అలాగే కోర్టు ద్వారా అరెస్టు వారెంట్ జారీ చేసినా కూడా ప్రజ్వల్ తిరిగి రాలేదు. ఇటీవల ప్రజ్వల్‌కు సంబంధించిన వ్యవహారం బయటపడటంతో.. ఏప్రిల్ 26న అర్ధరాత్రి దాటిన తర్వాత అతడు బెంగళూరు నుంచి జర్మనీకి పారిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి లండన్‌కు వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Also read: దూరదర్శన్‌లోకి వచ్చేస్తున్న ఏఐ యాంకర్లు..

Advertisment
తాజా కథనాలు