Praja Palana Application Status: అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పినట్లుగానే...అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్...ఒక్కో గ్యారెంటీని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆరు గ్యారెంటీ స్కీములకు అర్హత కలిగిన వాళ్లను ఎంపిక చేసేందుకు గతేడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వరకు ప్రజాపాలన పేరుతో అభయహస్తం(Abhaya Hastam Scheme) దరఖాస్తులను స్వీకరించింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్ర జనాభాలో నాలుగవ వంతు అంటే కోటి 5లక్షల మంది అప్లికేషన్స్ దాఖలు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్స్ స్క్రూటిని కోసం నెల రోజులు గడువు కోరింది.
ఈలోగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) జనవరి 7వ తేదీన వెబ్ సైట్ ప్రారంభించారు. అందులో ప్రజాపాలన కేంద్రాల దగ్గర ఇచ్చి దరఖాస్తు ఫాం రషీద్ నెంబర్ నమోదు చేస్తే ఆరు గ్యారెంటీలకు అర్హులో కాదో తెలిసే విధంగా వెబ్ సైట్ ను రూపొందించారు. ప్రస్తుతం ఆ లింక్ లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ వ్యూ కొడితే అప్రూవ్ అయ్యిందా లేదా రిజక్ట్ అయ్యిందో తెలుస్తుంది. ఈ లింక్ ఇప్పటికే చాలా మంది ఉపయోగించడం ప్రారంభించారు.
అభయహస్తం కోసం భారీగానే దరఖాస్తు చేసుకున్నారు ప్రజలు. రాష్ట్రంలోని 4 కోట్లకుపైగా ఉన్న జనాభాలో 4వ వంతు అంటే కోటిమందికిపైగా అప్లికేషన్స్ వచ్చినట్లుగా మంత్రులు తెలిపారు. అయితే ప్రజాపాలన పేరుతో వారం రోజుల పాటు ప్రభుత్వం సేకరించిన దరఖాస్తు చేసుకున్న వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఇటీవలే ఓ వైబ్ సైట్ ప్రారంభించారు. ఈ https://prajapalana.telangana.gov.in/Applicationstatus వెబ్ సైట్ లింక్ లో దరఖాస్తు నెంబర్ తో పాటు కింది బాక్సులో ఉండే క్యాప్చాను టైప్ చేసి వ్యూ స్టేటస్ పై క్లిక్ చేస్తే దరఖాస్తు రిజక్ట్ అయ్యిందా లేదా అప్రూవ్ అయ్యిందో తెలుస్తుందని సీఎం తెలిపారు.
ఇది కూడా చదవండి : అదిరే ఆఫర్.. కేవలం రూ.2500 కడితే ఎలక్ట్రిక్ స్కూటర్!
ఇక వందరోజుల్లో తప్పకుండా ఆరు గ్యారంటీలను (Six Guarantees) అమలు చేస్తామని..ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వంద రోజుల్లోగా ఈ ఆరు గ్యారంటీల అమలు జరుగుతుందని పలువురు నాయకులు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.