Revanth Reddy : హరీష్ రావు రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలి-సీఎం రేవంత్ రెడ్డి

హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నా అన్నారు తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.

New Update
Telangana : తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్‌.. ఫొటో వైరల్

Telangana CM Revanth Reddy : రెండులక్షల రుణమాఫీ(Runa Mafi) చేసి తీరుతాం అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంద్రాగస్టులోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ పథకాన్ని అములు చేస్తామనిచెప్పారు. బీఆర్ఎస్ నేత హరీష్‌రావు సవాల్‌ను స్వీకరిస్తుననాం అని...ఆయన తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. రైతులకు రుణమాఫీ చేయకపోతే మేమే అధికారంలో ఉండము అంటూ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. అలాగే హరీష్ రావు రాజీనామా లేఖను సరైన ఫార్మాట్ ఇవ్వాలని కోరారు. ఆయన ఇచ్చిన లేఖ ఏదో సీస పద్యంలా ఉందని అన్నారు. సరైన ఫార్మాట్‌లో లేఖను రాసి స్పీకర్‌కు ఇవ్వాలని రేవంత్ హరీష్ రావుకు సూచించారు.

అంతకు ముందు గన్ పార్క్‌(Gun Park) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిసస్థితులు నెలకొన్నాయి. చెప్పినట్టుగానే బీఆర్ఎస్ నేత హరీష్ రావు పెద్ద ఎత్తున గన్‌ పార్క్‌ వద్దకు నేతలు, కార్యకర్తలతో వచ్చారు.పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. గన్‌ పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ హరీష్‌ రావు(Harish Rao)  కార్యక్రమానికి కేవలం 5 గురికి మాత్రమే అనుమతి ఉన్నట్లు పోలీసులు వివరించారు. దీంతో బీఆర్‌ఎస్‌( BRS) కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 

ఏదిఏమైనా సరే లోపలికి మాత్రం 5 గురినే అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెప్పడంతో నేతలు , కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, బండారు లక్ష్మారెడ్డి, వివేకానంద ఉన్నారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.

సవాళ్లు.. ప్రతి సవాళ్లు..

కాగా.. రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) పై తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్‌(CM Revanth Reddy)  మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మాటల యుద్ధానికి దారితీసింది. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గన్‌పార్క్‌కు రాజీనామా లేఖతో చేరుకున్నారు. రేవంత్ కూడా అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా లేఖతో రావాలని, హరీశ్‌ రావు అన్నారు. రేవంత్ దూషణలు నిజమైతే రావాలని హరీష్ రావు సవాల్ చేశారు.

Also Read:Elections 2024: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్..ఓటేసిన ప్రముఖులు

Advertisment
తాజా కథనాలు