Harish Rao comments on Congress party Declaration: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్‌కు విలువ లేదని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అమలు చేయలేని హామీలు ఎన్ని ప్రకటిస్తే ఎం లాభం ఉంటుందన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొల్లాపూర్ నియోజకవర్గ నేత అభిలాష్ రావు మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ (BRS)లో చేరారు. ఆయన్న హరీష్ రావు కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకర్షించడానికి అనేక హామీలు ఇస్తుందన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందన్న మంత్రి.. ఎన్నికల తర్వాత ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
కర్ణాటకలో ప్రకటించినట్లుగానే తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ (Congress Party) హామీలను ప్రకటిస్తుందన్న ఆయన.. ప్రజలు కాంగ్రెస్ నేతల హామీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ దళితుల పట్ల కపట ప్రేమ చూపిస్తోందని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ బదులు 3 గంటల విద్యుత్ మాత్రమే వస్తుందన్నారు. దీంతో రైతులు గతంలో ఎదుర్కొన్న పరిస్థితిని మళ్లీ ఎదర్కొనే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ నేతల రౌడీ యిజం మళ్లీ మొదలౌతుందన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని, అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని మంత్రి వెల్లడించారు.
బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో కరెంట్ పోని తెలంగాణను రైతులు చూస్తున్నారన్నారు. కేసీఆర్ (CM KCR) హైదరాబాద్‌ను విశ్వ నగరంగా మార్చారని సూచించారు. సీఎం రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువలు పెంచారని మంత్రి గుర్తు చేశారు. దీంతో ఎకరం భూమి ఉన్న రైతు ఇప్పుడు లక్షాధికారి అయ్యాడని తెలిపాడు. ఆ రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు డబ్బులతో వ్యవసాయం చేసుకుంటూ లాభాలు అర్జిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల మేలు కోరుతుంటే.. విపక్షాలు మాత్రం రాజకీయ లబ్ది కోసం రైతులకు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు.
Also Read: బాల్క సుమన్‌పై సీఎం కేసీఆర్ ఆగ్రహం.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్