ముంబై ఇండియన్స్ కుటుంబంలో పాండ్యా అడుగుపెట్టిన నాటి నుంచి ఫ్యాన్స్ ఫుల్ ఆగ్రహంగా ఉన్నారు. రోహిత్‌ను కెప్టెన్‌గా పక్కనపెట్టి పాండ్యాను కెప్టెన్ చేయడమే దీనికి ప్రధాన కారణం. ఈ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. కొంతమంది ఏకంగా ముంబై జెర్సీలను తగలబెట్టారు. మ్యాచ్‌లు మొదలయ్యే సమయానికి ఈ నిరసనల పర్వం ఆగుతుందని అంతా భావించారు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో పాండ్యా చేసిన పలు తప్పిదాలు రోహిత్ ఫ్యా్న్స్‌కు మరింత కోపం తెప్పించింది. దీంతో సోషల్‌మీడియాలో హార్దిక్‌ను హర్పిక్ అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు.
ఇలా చేయవద్దు:
ఈ ట్రోల్స్ లైన్ క్రాస్ చేసినట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పాండ్యాను పనిగట్టుకోని ట్రోల్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదన్నది కొందరి వాదన. తాజాగా ఈ లిస్ట్‌లోనే చేరాడు ఓ బుడతడు. ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్‌గా మారింది. ట్రోల్ చేసుడు తప్పు అంటూ ఓ చిన్నపిల్లాడు చెబుతున్న మాటలు వైరల్ అవుతున్నాయి. రోహిత్, పాండ్యా.. మిగిలిన క్రికెటర్లు అంతా బానే ఉంటారని.. మనం ట్రోల్ చేయకూడతని ఆ పిల్లాడు చెబుతున్నాడు.
అసలేం జరిగింది?
ఉప్పల్ వేదికగా జరిగిన హైదరాబాద్ మ్యాచ్‌లో 20 ఓవర్లలో 278 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయడంలో పాండ్యా ఆడిన తీరు, అతని బాడీ లాంగ్వేజ్ ఏ మాత్రం గెలవలన్నా ఇంటెంట్‌తో లేదన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. అతను ఔటైన తీరు కూడా చాలా నిర్లక్ష్యంగా కనిపించింది. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఛేదనలో ముంబై ధీటుగా బదులిచ్చింది. గతంలో 15 ఓవర్లలోనే 190కు పైగా టార్గెట్‌ను ఛేజ్ చేసిన రికార్డు ముంబైకు ఉంది. ఛాలెంజ్‌లను ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకోని అసాధ్యాలను సుసాధ్యం చేసిన మ్యాచ్‌లు ముంబై ఖాతాలో చాలా ఉన్నాయి. అయితే పాండ్యా ఆట తీరు ముంబైకు సరిపోనట్టు ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అటు బౌలింగ్‌లో చివరి ఓవర్ ఓ సాధారణ స్పిన్నర్‌కు ఇవ్వడం అతని కెప్టెన్సీ స్కిల్స్‌ను క్వశ్చన్ చేసేలా ఉంది.
ALso Read: ఎర్రటి ఎండలతో ఉడికిపోతున్న తెలంగాణ..43 డిగ్రీల మార్క్ దాటిన ఉష్ణోగ్రత..!