Hanuman Success: అయ్యో.. తాట తీద్దామంటే.. మడతడిపోయిందిగా.. 

సంక్రాంతికి థియేటర్లు సరిపోవని చిన్న సినిమా అంటూ వెనక్కి తగ్గమని చెప్పిన హను-మాన్ ఇప్పుడు పెద్ద సినిమాలని మించి పోయింది. దేశవ్యాప్తంగా హనుమాన్ మోత మోగిస్తోంది. కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తూ దూసుకుపోతోంది.

New Update
Hanuman Success: అయ్యో.. తాట తీద్దామంటే.. మడతడిపోయిందిగా.. 

Hanuman Success: పండగ వచ్చేసింది. సరదాలు.. సంబరాలు మొదలైపోయాయి. అన్నిటికన్నా ముందుగా సినిమాల హంగామా మొదలైంది. సంక్రాంతికి తెలుగువారికి కొత్త అల్లుళ్ళూ.. కోడి పందాలు ఎంత ముఖ్యమో.. సినిమాలు కూడా అంతే ప్రధానం. అందుకే, సంక్రాంతికి సినిమా నిర్మాతలు.. దర్శకులు..హీరోలు తమ సినిమాలు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తారు. మామూలు రోజుల్లో కొట్టడం వేరు.. సంక్రాంతికి హిట్ లో ఉండే మజా వేరు అని వారు భావిస్తారు. అంతేకాదు.. అభిమానులు కూడా తమ హీరో సంక్రాంతికి మెరిసిపోవాలని భావిస్తారు. అందుకే సంక్రాంతి అంటే సినిమాల జోష్ అంతలా ఉంటుంది. 

సరే.. ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు రెడీ అన్నాయి. ఎప్పుడూ లేని విధంగా పెద్ద హీరోలు బరిలో రెడీ అయ్యారు. మహేష్ బాబు (Mahesh Babu), వెంకటేష్, నాగార్జున, రవితేజ.. వీళ్ళు నలుగురు వస్తుంటే.. మధ్యలో నేనూ సంక్రాంతికే రెడీ అన్నాడు బుడ్డోడు తేజా సజ్జా (Teja Sajja). చిన్నప్పటి నుంచీ ఎవరి సినిమాల్లో అయితే బాలనటుడిగా చేశాడో ఆ హీరోలతోనే జై హనుమాన్ అంటూ తొడగొట్టాడు. పండగ సినిమాలు ఐదు. మరి వాటికి థియేటర్లు? ఇదిగో ఇక్కడ మొదలైంది అసలైన పందెం. పుంజులు రెడీ.. చూడటానికి జనమూ రెడీ.. పందెం వేస్తున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రెడీ.. కానీ బరులే లేవు. కాదు.. కాదు.. కొంతమంది చేతిలో కబ్జా అయిపోయి ఉన్నాయి. కట్ చేస్తే.. 

నువ్వెంత.. నీ రేంజ్ ఎంత? థియేటర్లు  కష్టం అని చెప్పేసిన పెద్దోళ్ళకి షాక్ ఇచ్చింది హనుమాన్ సినిమా. స్టారింగ్ కాదమ్మా కంటెంట్ చూడండి అని మొత్తుకున్నా వినని దిల్ రాజుకి దిమ్మ తిరిగేలా పంచ్ ఇచ్చింది హనుమాన్. సినిమా అంటే.. మాటల మంత్రాలు.. పెద్ద హీరోలతో కౌగిలింతల తంత్రాలు.. కాదు. అయినా పెద్ద.. చిన్న సినిమాల విభజనే తప్పు.. కంటెంట్ ఉన్నోడే గొప్పోడు.. ఆ కంటెంట్ ని సెల్యులాయిడ్ మీద అందంగా పరిచినోడు సంక్రాంతికే కాదు ఏ పండగకైనా దమ్మున్నోడు అవుతాడు అని రుజువు చేసింది హనుమాన్(Hanuman Movie). సినిమా కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది.. నాలుగు థియేటర్లు ఇచ్చినా చాలు తర్వాత మా కంటెంట్ చూసుకుంటుంది అని విశ్వాసంతో చెప్పిన హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) మాటలు నిజాలు అయ్యాయి. ఇంతై వటుడింతై అన్నట్టు.. మూడో కాలు ఎక్కడ పెట్టను అని అడిగి వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కినట్టు.. చిన్న సినిమా అన్నవారి కుర్చీ మడత పెట్టేసి..  సంక్రాంతికి తెలుగు ప్రజల వినోదానికి కేరాఫ్ ఎడ్రస్ గా మారిపోయాడు హను-మాన్. 

Also Read: “హను మాన్” ఆల్ ఇండియా వైడ్ గా సరికొత్త రికార్డు

ఎదో తెలిసిన వార్తను పదిమందికీ పంచి ఇచ్చే జర్నలిస్టుల తాట  తీస్తానన్న పెద్ద మనిషి అహంకారానికి.. వ్యాపారం ఎలా చేయాలో కూడా రుచి చూపించారు హనుమాన్ మేకర్స్. అవును.. సినిమాని ఒకరోజు ముందుగానే ప్రీమియర్ పేరుతో 600 పైచిలుకు షోస్ గుంటూరు కారం కంటే కొద్దిగా ముందుగా జనాల్లోకి వదిలేశారు. తోకకు నిప్పు అంటిస్తే లంకను తగలెట్టిన ఆంజనేయుడిలా ఆ ఆరొందల షోలు సంక్రాంతికి బరిలో ఉన్న అన్ని సినిమాల అంచనాలను కాల్చి బూడిద చేసేశాయి. తమ చిన్నారులతో పాటు సినిమాకి వచ్చి చూసిన ప్రేక్షకులు ఇది కదా సినిమా అని చెప్పేశారు. అంతే.. గుంటూరు కారంపై ఒకరకమైన నెగెటివ్ పునాది పడిపోయింది. కొద్ది గంటలు ఆలస్యంగా మొత్తం అన్ని థియేటర్లలోనూ విడుదలైన సినిమా మూడో షో నుంచే మూలకి వెళ్ళిపోయింది. జర్నలిస్టుల తాట  తీస్తానంటూ వీరంగం చేసిన దిల్ రాజు బిజినెస్ స్ట్రాటజీని ఒక్క ప్రీమియర్ షో స్ట్రాటజీతో చిన్న లాజిక్ తో పెద్ద దెబ్బ కొట్టేశారు హను-మాన్ మేకర్స్. 

ఈ మొత్తం ఎపిసోడ్ లో చివరికి చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. కంటెంట్ దమ్ము ముందు.. ఏ పెద్ద పెద్ద కబుర్ల ప్రచారాలైనా దుమ్ముకొట్టుకు పోతాయి. కంటెంట్ ని నమ్ముకున్నోడిని అదే కింగ్ ని చేస్తుంది. కంటెంట్ లేకుండా నేనే కింగ్ అంటే.. ఇదిగో ఇలానే తాట తెగిపోద్ది. వింటున్నారా.. తెలుగు సినిమా పెద్దోళ్ళూ… 

Watch this interesting Video:

#tollywood #movie-news #hanuman-movie #teja-sajja
Advertisment
Advertisment
తాజా కథనాలు