HanuMan - Ayodhya Rama Mandir: అయోధ్య రామ మందిరానికి రూ 14 లక్షలు విరాళంగా ఇచ్చిన హను మాన్ మూవీ టీమ్

చిన్న సినిమాగా వచ్చి వసూళ్ల సునామి సృష్టిస్తోన్న హనుమాన్ మూవీ మేకర్స్ ముందుగా ప్రకటించినట్లుగానే టికెట్స్ నుంచి వచ్చే ప్రతీ రూ 5 లను మొత్తం రూ 14 లక్షలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇవ్వడం జరిగింది.

HanuMan - Ayodhya Rama Mandir: అయోధ్య రామ మందిరానికి రూ 14 లక్షలు  విరాళంగా ఇచ్చిన హను మాన్ మూవీ టీమ్
New Update

HanuMan-Ayodhya Rama Mandir: చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండవు. ప్రేక్షకులు మెచ్చేదే పెద్ద సినిమా . బడ్జెట్ ను బట్టి సినిమాను అంచనా వేయలేము. కంటెంట్ లో దమ్ముంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరో సారి రుజువు చేసింది హనుమాన్ మూవీ . ఈ సినిమా విజయం పట్ల ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.. సినిమా హాళ్ల విషయంలో సైతం చాలా ఆటంకాలు ఎదుర్కొంది హనుమాన్ మూవీ. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం సినిమా రిలీజ్ చెయ్యాలంటే యుద్ధమే అన్నాడంటే .. ఎన్ని ఆటంకాలు ఎదురయి ఉంటాయో అర్ధం చేస్కోవచ్చు . ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి ( chiranjeevi ) సైతం ఈ మూవీకి వెన్నుదన్నులా నిలిచినా సరే .. సినిమా హాళ్లు పెంచే విషయంలో ముందడుగు వెయ్యలేదు. ఏదైతే నేఁ ఇప్పుడు హనుమాన్ మూవీ సృష్టిస్తున్న సంచలనాలు మాములుగా లేవు. సినిమా రిలీజ్ ముందు రోజు తీసుకున్న డెషిషన్ సినిమా రూపు రేఖలనే మార్చేసింది.

14 లక్షల రూపాయలు విరాళం

పెయిడ్ ప్రీమియర్స్ గా ముందు రోజు రిలీజయి అనూహ్యమైన రీతిలో పెద్దసినిమాలకు ధీటుగా దూసుకుపోతోంది.వసూళ్ల సునామీతో విజయదుందుబి మోగిస్తోంది.రాయితీ ప్రీ రిలీజ్ ఉత్సవ్ లో మాట ఇచ్చినట్లుగానే ..ఈ సినిమా వసూళ్ల నుంచి ప్రతీ టికెట్ లో ఐదు రూపాయలు అయోధ్య శ్రీరామ మందిరానికి విరాళంగా ఇస్తామని మెగా స్టార్ చిరంజీవి గారిచే ప్రకటన చేయించారు మేకర్స్. అనుకున్నట్లుగానే సినిమా కలెక్షన్లలోంచి కొత్త మొత్తాన్ని విరాళంగా ఇచ్చేందుకు మేకర్స్ ముందుకొచ్చారు. ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చిన అమౌంట్లో ఈ రోజు రూ. 14 లక్షల రూపాయలను అయోధ్య రామ మందిరానికి అందించారు హను మాన్ టీమ్. అలానే మూవీ ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజుల వరకు వచ్చిన టికెట్ డబ్బులో నుండి ఇదే విధంగా ఫైనల్ గా అయోధ్య రామ మందిరానికి అందించడం జరుగుతుందని హనుమాన్ మేకర్స్ తెలిపారు.

బుక్ మై షో లో  సెన్సేషన్

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) నిర్మించిన హనుమాన్ మూవీ నార్త్ లో దుమ్ము రేపుతోంది. కానీ వినీ ఎరుగని వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక.. బుక్ మై షో లో అయితే సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం 9.7 రేటింగ్ తో దూసుకు పోవడం హనుమాన్ క్రేజ్ ఏంటో ఈ రేటింగ్ బట్టి అర్ధమవుతోంది. ఇక.. లాంగ్ రణలో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. రెడ్డి నిర్మించిన హనుమాన్ మూవీ నార్త్ లో దుమ్ము రేపుతోంది. కానీ వినీ ఎరుగని వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక.. బుక్ మై షో (Book My Show)లో అయితే సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం 9.7 రేటింగ్ తో దూసుకు పోవడం హనుమాన్ క్రేజ్ ఏంటో ఈ రేటింగ్ బట్టి అర్ధమవుతోంది. ఇక..లాంగ్ రన్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ALSO READ:Hanu-Man : “హను మాన్” ఆల్ ఇండియా వైడ్ గా సరికొత్త రికార్డు

#hanuman #ayodya-rama-mandir #prasanth-varma #tejasajja #prime-show-entertainment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe