/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-56-1-jpg.webp)
AYODHYA RAM MANDHIR :ప్రతీ హిందువు ఎన్నో దశాబ్దాల కల అయోధ్య రామాలయ నిర్మాణం నెరవేరే సమయం ఆసన్నమయింది.యావత్ భారతదేశం శ్రీరామ నామస్మరణతో పులకించిపోతోంది. జనవరి 22 న జరగబోయే ప్రారంభోత్సవానికి ఎందరో భక్తులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో హనుమాన్ మూవీ టీమ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.సంక్రాంతి రేసులో జనవరి 12 న చిన్న సినిమాగా రిలీజవుతున్న హనుమాన్ సినిమా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఫస్ట్ లుక్ విడుదల చేసిన దగ్గరనుంచి ట్రైలర్ వరకూ ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంటోంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న క్రమంలో ఈ మూవీ ప్రి రిలీజ్ ఉత్సవ్ ను నిర్వహించారు హనుమాన్ మేకర్స్.
చిరంజీవి జీవితంలో హనుమాన్ ప్రభావం
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.అంతేకాకుండా తను ఈ స్థాయికి రావడానికి హనుమంతుడి ప్రభావం తన మీద ఎంతటి ప్రభావం చూపిందో చెప్తూ చిన్ననాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన సంఘటనలను ప్రేక్షకులతో పంచుకున్నారు. దర్శకుడు (Prasanth varma) ప్రశాంత్ వర్మను, హీరో (Teja Sajja) తేజ సజ్జాకు అభినందనలు తెలిపారు.
ప్రతీ టికెట్ మీద వచ్చే ఆదాయంలో 5 రూ.లు అయోధ్య రామాలయానికి విరాళం
అనంతరం..హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వేదికపై తన మాటగా చెప్పుకొచ్చారు. హనుమాన్ సినిమాకు తెగే ప్రతీ టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో ఐదు రూపాయలు అయోధ్య రామాలయానికి విరాళంగా ప్రకటీస్తున్నట్లు చిరు ప్రకటించారు.అయోధ్యలో నిర్మించిన రామమందిరం చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం గా నిలిచిపోతుందని, ఈ విశిష్ట పుణ్య కార్యానికి ఎవరు ఏ రూపంలో అయినా సహాయ సహకారాలు అందిoచవచ్చనీ . ‘హనుమాన్’ చిత్ర బృందం తీసుకొన్న ఈ నిర్ణయాన్ని కొనియాడుతూ ఆపుణ్యం ఈ టీమ్ కి దక్కుతుందనీ చిరు ప్రశంసల జల్లు కురిపించారు. అనంతరం ఈ చిత్రం ఆ హనుమాన్ ఆశీస్సులతో ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఆకాక్షించారు.
ALSO READ:గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ? ..మరి కాసేపట్లో ట్రైలర్ రిలీజ్
 Follow Us
 Follow Us