Hanu-Man : “హను మాన్” ఆల్ ఇండియా వైడ్ గా సరికొత్త రికార్డు

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన హను మాన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సెట్ చేసింది. పెయిడ్ ప్రీమియర్ షో లలో ఇండియాలోనే అత్యదిక వసూళ్ళు రాబట్టిన మొట్టమొదటి సినిమాగా నిలిచింది.

New Update
Hanu-Man : “హను మాన్” ఆల్ ఇండియా వైడ్ గా సరికొత్త రికార్డు

Hanu-Man New Record : టాలివుడ్(Tollywood) మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండియన్ సినిమా(Indian Cinema) గా మారారు. జనవరి 12 న రిలీజయిన హనుమాన్(Hanu-Man) సినిమా పెద్ద సినిమాల తాకిడికి తట్టుకుని  బ్లాక్ బస్టర్ దిశగా దుస్కుపోతోంది. తేజ సజ్జ(Teja Sajja) పెర్పార్మేన్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తునారు. ఈ క్రమంలో హనుమాన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పండగ సీజన్ కావడంతో గుంటూరు కారం సినిమా బడ్జెట్ ను బట్టి వసూళ్ళు రాబట్టాలిసిన అవసరం ఉంది కాబట్టి ఈ సినిమాకు అధిక సినిమా థియేటర్స్ కేటాయించడం జరిగింది. హనుమాన్ మూవీకి చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారు. అయితే పండగ సీజన్ కాబట్టి స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ దృష్ట్యా హనుమాన్ టీం ఆ కొన్ని థియేటర్స్ లోనే  రిలీజ్ చేసారు.మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో  ఊహించని  విధంగా థియేటర్స్ పెంచాల్సిన పరిస్తితి ఎదురయింది. షో కి షో కి థియేటర్స్ హౌస్ ఫుల్ల్స్ అవుతుండటం.. ఎక్కడ చూసినా హను మాన్ నామ స్మరణమే ఉండటంతో థియేటర్స్ పెంచారు.

ారతదేశంలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన మొట్టమొదటి  సినిమా

సినిమా మీద ఉన్న నమ్మకంతోనే మేకర్స్ పెయిడ్ ప్రిమియర్స్(Paid Premieres) ను స్టార్ట్ చేసారు. ఈ షో లకి విపరీతమైన్స స్పందన రావడంతో పెయిడ్ ప్రిమియర్స్ థియేటర్స్ సంఖ్యను పెంచారు. ఈ సినిమా పెయిడ్ ప్రిమియర్స్ కు  రికార్డు స్థాయిలో స్పంధన రావడంతో  హను మాన్ ఏకంగా ఇండియన్ రికార్డు సెట్ చేసిందని హనుమాన్  మేకర్స్ చెప్తున్నారు. పెయిడ్ ప్రీమియర్స్ షో లలో  బారతః దేశంలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన మొట్టమొదటి  సినిమాగా హను మాన్  నిలిచిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రోల్స్ చేసిన వాళ్లే ప్రశంసలు

హను మాన్. సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభని యావత్ భారతదేశం(India) కొనియాడుతోంది. హను మాన్ ప్రమోషన్స్ లో ప్రశాంత్ వర్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంచి బడ్జెట్ , మంచి టీం ఇస్తే అవతార్ లాంటి సినిమాలను తీస్తానని అన్న మాటలకు అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఈ యంగ్ డైరెక్టర్ చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడని ట్రోల్స్ కూడా చేసారు. ఇప్పుడు ఈ  సినిమా చూసిన వాళ్ళు నిజమే ఈ దర్శకుడికి మంచి బడ్జెట్ ఇస్తే.. అవతార్ లానతి సినిమాలు తప్పకుండా తీస్తాడని కొనియాడుతున్నారు. అప్పట్లో విమర్శలు చేసిన వాళ్ళే ఇప్పుడు ప్రసంసిస్తున్నారు. హనుమాన్ రెండవ బాగానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ : దేశముదురు ,అల . వైకుంటపురంలో చిత్రాలపై  బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Advertisment
తాజా కథనాలు