హమాస్ చేసే దురాగతాలను మాకు అంటగట్టకండా అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్. పాలస్తీనా లిబరేషన్ ఆర్ఘనైజేషన్ విధివిధానాలో మావి అని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మహమూద్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో అమాయక ప్రజలు బలి అయిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు తమ దగ్గర ఉన్న బందీలను విడుదల చేయాలని అబ్బాస్ కోరారు.
ఇక ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య దాడుల మీద ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ దాడులు చాలా దారుణంగా ఉన్నాయని... ప్రతీ ఒక్కరూ దాన్ని ఖండించాల్సిందే అంటూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వెంటనే విడిచిపెట్టాలని ఆయన కోరారు. అలాగే ఇజ్రాయెల్ కూడా గాజాలో తమ దాడులను ఆపాలని సూచించారు. దీనివలన గాజాలో లక్షల మంది అమాయక ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఇది ఇక్కడతో ఆగిపోదు, భవిష్యత్తులో కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది టెడ్రోస్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉత్తర గాజా నుంచి చాలా మంది తరలి వెళుతున్నారు కానీ వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
Also Read:వీళ్ళు మామూలోళ్ళు కాదు…ఏకంగా ఇంగ్లాండ్ నే ఓడించేశారు.
ఇక గాజాలోనే ఇప్పటికీ ఉంటున్న లక్షల మంది నరకాన్ని అనుభవిస్తున్నారు. తినడానికి తిండి లేక, కరెంట్ లేదు...దాని తోడు ప్రాణ భయంతో అల్లల్లాడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏం బాంబు వస్తుందో తెలియక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం తాము తగ్గేదే లేదు అని అంటోంది. హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను రక్షించే వరకు తమ దాడులు కొనసాగుతాయని స్ట్రాంగ్ గా చెబుతోంది. ఇజ్రాయెల్-హమాస్ దాడుల్లో ఇప్పటివరకు 2,329మంది పాలస్తీనియన్లు చనిపోయారు. హమాస్ దాడిలో 1300 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. గాజాలో 7వేలకు పైగా ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. మరోవైపు గాజాను వదిలి వెళుతున్న వేలాది మంది కోసం రెండు సురక్షిత కారిడార్లను ఏర్పాటు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఉత్తర గాజాలో 10 లక్షల మంది ఉన్నాు. అందరూ అక్కడి నుంచి తరలి వెళ్ళాలంటే వారం నుంచి పది రోజులు పడుతుందని అంచనా.
మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ముఖ్య కమాండర్లను ఒక్కొక్కరినే మట్టుబెట్టుకొస్తోంది. ఇప్పటికి ఇద్దరు ముఖ్య కమాండర్లు తమ దాడిలో మరణించారని ఇజ్రాయెల్ ప్రకటించింది.