Israel Hamas War: హమాస్ సీనియర్ మెంబర్ ఖతం...మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్టేనా?

తమ వైమానికి దాడుల్లో హమాస్ సీనియర్ మెంబర్ ఒకరు చనిపోయారని ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి. మురద్ అబు మురద్ అనే సీనియర్ మిలిటెంట్ మెంబర్ మృతి చెందినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా జరుగుతున్న హమాస్ దాడులకు మురద్ ముందుండి నడిపించాడని ఇజ్రాయెల్ ఫోర్సెస్ చెబుతున్నాయి.

Israel Hamas War: హమాస్ సీనియర్ మెంబర్ ఖతం...మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్టేనా?
New Update

Hamas Senior Died in Israel Hamas War: మొన్నొక ముఖ్య కమాండర్, ఈరోజు సీనియర్ మెంబర్...ఇలా ఇద్దరు ముఖ్యమైన వారు ఇజ్రాయెల్ (Israel) దాడుల్లో మృతి చెందారు. ఈరోజు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హమాస్ సీనియర్ మెంబర్ మురద్ అబు మురద్ (Murad Abu Murad) చనిపోయాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఫోర్సెస్ అధికారికంగా ప్రకటించింది. వారం కిత్రం ఇజ్రాయెల్లో హమాస్ చేసిన దాడులకు మురద్ నేతృత్వం వహించాడు. ఇప్పుడు మురద్ చనిపోవడం హమాస్ గ్రూప్ కు పెద్ద దెబ్బే. ఇద్దరు ముఖ్య వ్యక్తులు చనిపోవడంతో మిలిటెంట్లు డిఫెన్సులో పడిపోయారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఎండ్ స్టేజ్‌కు వచ్చినట్లే అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ దేశస్థులు దొరికే వరకు ఇజ్రాయెల్ తమ పోరాటాన్ని ఆపేదిలేదని స్పష్టం చేసింది.

Also Read: మొదలైన ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్..ఇక ఏరిపారేయడమే

ఇజ్రాయెల్, హమాస్ మధ్య వారం రోజులగా దాడులు జరుగుతున్నాయి. గాజాపై భూ దాడికి సిద్ధమైంది ఇజ్రాయెల్‌. దీనికి సంబంధించి 11 లక్షల మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్‌ డెడ్‌లైన్‌ ఇచ్చింది. 24 గంటల్లో దక్షిణ దిశకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గాజాకు నిత్యావసరాల సరఫరాను ఇజ్రాయెల్‌ నిలిపేసింది. ఇప్పటివరకు వైమానిక దాడులకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గాజాలో అడుగుపెట్టి ప్రతీ ఇంటినీ గాలించి మిలిటెంట్లను ఏరిపారేయాలని అనుకుంటోంది. పాలస్తీనా మిలిటెటంట్లను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా కదులుతోంది.ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్ స్థావరాల మీద విరుచకుపడుతున్నాయి. సాధారణ పౌరులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేస్తున్న ఉగ్రమూకలపై ఊహించని విధంగా దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా గాజా (Gaza) పరిసర ప్రాంతాల్లో సొరంగాల్లో దాక్కుని దాడులు చేస్తున్న వాళ్లని కనిపెట్టి గట్టి బదులిస్తున్నారు. బందీలుగా ఉన్న వాళ్ళను ఇజ్రాయెల్ సైన్యం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కాపాడుతున్నాయి.

ఇప్పటికే దాదాపు రెండు వైపులా కలిసి 2, 600 మంది మరణించారు. మరింతమంది మరణించడం ఆందోళన కలిగించే విషయంగా మారుతుందని, యుద్ధం వలన సామాన్య మానవులు బలైపోతారని ఐక్యరాజ్య సమితి అంటోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం బందీలుగా ఉన్న తమ పౌరులను వదిలిపెడితేనే గాజాలో అటాక్ చేయకుండా ఉంటామని అంటోంది. అంతేకాదు గాజాకు ఆహారం, నీరు కూడా ఇస్తామని చెబుతోంది.

Also Read: మేము సైతం అంటూ యుద్ధంలో మాజీ ప్రధాని, మోడల్ ఫదీప్..!!

#israel-hamas-war #senior-member #israel #rtvlive-com #hamas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe