Iran Vs Israel : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. వేడెక్కుతున్న ప్రపంచం

ఎవరెన్ని చెప్పినా ఇజ్రాయెల్ మీద ఇరాన్ తన దాడులను ఆపలేదు. 30సెకన్లలో ఇజ్రాయెల్‌పై 7సార్లు మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. దానికి తోడు పైగా ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్ మీద దాడులకు దిగాల్సి వచ్చిందని యూఎస్ వేదికగా సంచలన ప్రకటన సైతం చేసింది ఇరాన్.

New Update
Iran Vs Israel : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. వేడెక్కుతున్న ప్రపంచం

Iran Attacking On Israel : ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel) మధ్య పరిస్థితులు ఉద్రిక్తమవుతున్నాయి. రెండు దేశాలు యుద్ధం చేయడానికే రెడీ అవుతున్నాయి. ఇరాన్ మీద అటాక్ చేసింది తాము కాదు అని ఇజ్రాయెల్ చెబుతున్నా ఇరాన్ వినడం లేదు. దీని మీద ఐక్యరాజ్యసమితి(United Nations) వేదికగా ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే.. ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాల్సి వచ్చిందని చెబుతోంది. మా దేశం జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదని UNవేదికగా హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడులకు తెగబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్‌ కూడా ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్‌ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఇరాన్‌కు ధీటుగానే సమాధానమిస్తోంది. అదునుచూసి ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. సిరియాలోని డమాస్కస్‌లో ఇరాన్‌ కాన్సులేట్‌ భవనాన్ని ఇజ్రాయెల్‌ మిస్సైల్స్ నేలమట్టం చేసిన దగ్గర నుంచీ ఈ గొడవ మొదలైంది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా(America) ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతోంది. ఇజ్రాయెల్‌ మీద దాడులకు తెగబడితే తాము చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తోంది. ఇరాన్‌ కూడా అమెరికా గట్టిగానే సమాధానం ఇస్తోంది. మధ్యలో జోక్యం చేసుకుంటే బాగుండదని...వ్ర పరిణామాలు ఉంటాయని అధ్యక్షులు జో బైడెన్‌కు హెచ్చరికలు పంపించింది. ఇజ్రాయెల్‌కు తమకు మధ్య పోరు అని...ఎవరూ మధ్యలో తలదూర్చద్దని సూచిస్తోంది ఇరాన్.

విరుచుకుపడుతున్న ఇరాన్...

ఇక చెప్పినట్టుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైల్స్ విరుచుకుపడుతున్నాయి. 300కుపైగా క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్‌ మిస్సైల్స్‌తో భీకరదాడులు తెగబడ్డాయి. 30సెకన్లలో ఇజ్రాయెల్‌పై 7సార్లు మిస్సైల్స్‌తో ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరుతో వందలాది డ్రోన్లు, మిసైళ్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. సౌత్‌ ఇజ్రాయెల్‌లోని, ఇజ్రాయెల్‌లోని ఎయిర్‌బేస్‌ను మిస్సైల్స్ ధ్వంసం చేశాయి. మరోవైపు ఇరాన్‌ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెబుతోంది ఇజ్రాయెల్‌. 99శాతానికి పైగా వెపన్స్‌ను కూల్చేశామని తెలిపింది. ఏరో డిఫెన్స్‌ సిస్టమ్‌ సాయంతో ఇరాన్‌ బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను కూల్చేశామని చెప్పింది. ఇది కాకుండా రంగంలోకి మధ్యదరా సముద్రంలోని అమెరికా వార్‌ షిప్‌లను కూడా దించింది ఇజ్రాయెల్.

ఉద్రిక్తతల నడుమ ప్రపంచం..

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్‌పై దాడులు వెంటనే ఆపాలని ప్రపంచదేశాలు కోరుతున్నాయి. ఈ ఇద్దరి మధ్యా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొద్దని అంటున్నాయి. ఇరాన్‌ దాడిని UNసెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ కూడా ఖండించారు. ఇక ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేవాలు మద్దతు పలికాయి. ఇప్పుడు వీరికి కెనడా కూడా తోడు అయింది. మరోవైపు ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య నెలకొన్న పరిస్థితులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని చెబుతోంది. ఇదిలా ఉంటే ఇరాన్‌కు మద్దతుగా రష్యా, చైనాలు వస్తున్నాయి. యుద్ధం కనుక ముదిరితే ఈ రెండు దేశాలు కూడా ప్రచ్ఛన్న యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది. అందుకే ప్రపంచ దేశాలు అన్నీ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. పరిస్థితులు చేయిదాటిపోతే రెండు దేశాల మధ్య వైరం ఐదు దేశాల మధ్య పోరు అయిపోయే ప్రమాదం ఉంది. అది కూడా అన్నీ పెద్ద దేశాలే అవడం గమనార్హం. అదే కనుక జరిగితే ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Also Read : Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు