Fingers Tips: వేళ్లు విరిచే అలవాటు చెడ్డదా..మంచిదా?

వేళ్లు విరిచేటప్పుడు బాగానే ఉన్నా దాని వల్ల ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. వేళ్లు పదే పదే విరచడం వల్ల వేళ్ల కీళ్లు బలహీనపడతాయని, వేళ్లు వంకరగా మారే అవకాశంతోపాటు, కీళ్లనొప్పులు కూడా పెరుగుతాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.

New Update
Fingers Tips: వేళ్లు విరిచే అలవాటు చెడ్డదా..మంచిదా?

Fingers Tips: కొంతమంది కూర్చుని ఉన్నప్పుడు తరచూ వేళ్లు విరుస్తూ ఉంటారు. వేళ్లు విరిచేటప్పుడు బాగానే ఉన్నా దాని వల్ల ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. ఒక పరిశోధన ప్రకారం వేళ్లు పదే పదే విరచడం వల్ల వేళ్ల కీళ్లు బలహీనపడతాయని, వేళ్లు వంకరగా మారే అవకాశాలు ఉంటాయని తేలింది. అంతేకాకుండా తరచూ వేళ్లు విరచడం వల్ల చేతుల పట్టు బలహీనపడుతుంది. ఇది నరాల, కండరాలకు హాని కలిగించవచ్చని నిపుణులు అంటున్నారు. దీని వల్ల కీళ్లనొప్పులు కూడా పెరుగుతాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. కీళ్లలోని ద్రవంలో గ్యాస్ బుడగలు ఏర్పడతాయని, ఇవి వేళ్లు విరిచినప్పుడు విడుదలవుతాయని నిపుణులు చెబుతున్నారు.

publive-image

కీళ్లు తొలిగే ప్రమాదం:

  • నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అప్పుడప్పుడు వేళ్లు విరిస్తే సమస్య ఉండదు కానీ ప్రతిరోజూ అలాగే చేస్తే ఇబ్బందుల్లో పడతారని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల వేలి కీళ్ల కణజాలం బలహీనపడుతుంది. కీళ్లు పక్కకి తొలిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కీల్ల నొప్పులు కూడా వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఈ అలవాటు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

publive-image

నిపుణులు ఏమంటున్నారు..?

  • వేళ్లు విరిచే అలవాటును మానుకోవాలని సలహా ఇస్తున్నారు. అలాగే ఒకవేళ చేతి వేళ్ల కీళ్లు పట్టేసినట్టు ఉంటే ఏదైనా ఆయిల్‌తో సున్నితంగా మర్దనా చేసుకోవాలని చెబుతున్నారు. ఒక వేళ నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించి తగిన మందులు వేసుకోవాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలకు వేళ్లు విరిగే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వారి వేళ్లు సున్నితంగా ఉంటాయి కాబట్టి విరచడం మంచిది కాదని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: బకెట్‌ నీటీలో చిటికెడు ఉప్పు.. ఇలా స్నానం చేస్తే ఎన్నో లాభాలు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు