Bath Tips: బకెట్ నీటీలో చిటికెడు ఉప్పు.. ఇలా స్నానం చేస్తే ఎన్నో లాభాలు! ఉప్పు నీటిలో యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. బకెట్ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేస్తే చాలు.. ఇది చర్మాన్ని మెరుగుపరచడంతో పాటు కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. By Vijaya Nimma 21 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bath Tips: వేడినీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద వైద్యులు వివరిస్తున్నారు. ఉప్పు ఘాటైన లక్షణాల కారణంగా ఇది రంధ్రాలలోకి చొచ్చుకుపోయి శుభ్రం చేయగలదని చెబుతున్నారు. అంతే కాకుండా ఇందులో ఉండే ఔషధ గుణాలు మీ శరీరాన్ని అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడానికి కూడా పనిచేస్తాయి. స్నానపు నీటిలో సాధారణంగా మెగ్నీషియం సల్ఫేట్ (ఎప్సమ్ సాల్ట్) యూజ్ చేయవచ్చు. ఇది వేడి నీటిలో సులభంగా కరిగిపోతుంది. ఒక బకెట్ నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు యాడ్ చేయవచ్చు. ప్రయోజనాలేంటి..? స్నానానికి వేడినీటిలో ఉప్పు కలిపి వాడటం వల్ల చర్మం మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఉప్పు నీటి స్నానంతో కీళ్లనొప్పులు, మోకాళ్లు, వెన్నునొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. వేడినీటిలో ఉప్పు కలిపి స్నానం చేస్తే అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విధంగా స్నానం చేయడం వల్ల రోజులోని అలసట నిమిషాల్లో తొలగిపోయి, రాత్రిపూట గాఢమైన నిద్ర వస్తుంది. తామర, సోరియాసిస్ లాంటి వాటికి కూడా ఆ సాల్ట్ బాత్ పని చేయవచ్చు. ఉప్పు నీటిలో యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మంటను తగ్గిస్తాయి. శరీరానికి బలాన్ని ఇస్తాయి. ఉప్పు నీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ప్రమాదకరమైన సూక్ష్మక్రిములను తొలగించడంలో సహాయపడతాయి. దీని వల్ల శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. ఇది కూడా చదవండి: హీరోహీరోయిన్ నిజంగానే ముద్దు పెట్టుకుంటారా? రొమాంటిక్ సీన్స్‌ని ఎలా షూట్ చేస్తారు? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #bath-tips #health-tips #salt #salt-bath-benefit మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి