Pakistan : పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్ట్(Gwadar Port) ప్రాంతం అనేది ఒకప్పుడు చేపలు పట్టేవారికి, వ్యాపారులకు ఓ చిన్న పట్టణంగా ఉండేది. ఈ చిన్న ప్రాంతమే.. ఇప్పుడు పాకిస్థాన్‌లోని మూడవ అతిపెద్ద పోర్టుగా ఉంది. అయితే ఈ గ్వాదార్ పోర్టు అనేది పాకిస్థాన్‌ది కాదు. 1950 వరకు దాదాపు 200 ఏళ్ల పాటు ఇది ఒమాన్ల పాలనలో ఉండేది. 1947లో భారత్(India) నుంచి పాకిస్థాన్ విడిపోయిన తర్వాత.. 1958లో పాకిస్థాన్ ఈ పోర్టును స్వాధీనం చేసుకుంది. కానీ అంతకుముందు ఈ ప్రాంతాన్ని భారత్‌కు ఇచ్చేందుకు ఒమాన్ సుల్తాన్(Oman Sultan) సిద్ధమయ్యాడు. కానీ ఇందుకు అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒప్పుకోలేదు.
Also read: వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే..
ఇలా చేయడం తప్పు !
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న నేపథ్యంలో.. అప్పట్లో కాంగ్రెస్(Congress) కచ్చతీవు దీనిని శ్రీలంకకు ఇచ్చేంసిందంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అలాగే కశ్మీర్, టిబెట్ పీఠభూమి విషయంలో కూడా తరచుగా విమర్శలు చేస్తుంటాయి. కానీ ఈ గ్వాదర్ పోర్టు అంశం మాత్రం రాజకీయంగా చర్చనీయాంశం కాలేదు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక.. ఒమాన్ సుల్తాన్ నుంచి ఇంతటి విలువైన బహుమతిని తిరస్కరించడం అనేది ఒక అతిపెద్ద తప్పు అని.. కానీ దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదని బ్రిగాడియర్ గర్మీట్ కన్వాల్ అనే ఓ రిటైర్ట్ సైనికుడు తెలిపారు. అసలు ఈ గ్వాదర్ పోర్టును భారత్ ఎందుకు వదులుకుందో యూరాసియా గ్రూప్ సంస్థకు చెందిన సౌత్ ఆసియా హెడ్ ప్రమిత్ పాల్ చౌదరీ వివరించారు.
ఎందుకు తిరస్కరించారు
'పాకిస్థాన్‌లోని బలుచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉన్న గ్వాదర్ పోర్టును 1783లో ఒమాన్ సుల్తాన్‌లు స్వాధీనం చేసుకున్నారు. మనకు స్వాతంత్ర్యం వచ్చాక ఒమాన్.. గ్వాదర్‌ను ఆఫర్ చేసినప్పటికీ అప్పటి ప్రధాని జవర్‌హార్‌లాల్ నెహ్రూ కావాలని దీన్ని తిరస్కరించలేదు. ఇందుకు పరిస్థితులు కూడా కారణమయ్యాయి. అప్పటి విదేశీ సెక్రటరీ, సుబిమాల్ దత్, భారత ఇంటిలిజెన్స్ బ్యూరో చీఫ్. బీఎన్ ముల్లిక్‌లు.. సుల్తాన్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరలించాలంటూ నెహ్రూకు ప్రతిపాదన చేశారు. ఒకవేళ నేహ్రూ ఈ ఆఫర్‌ను అంగీకరించనట్లేతే.. మనకు ప్రవేశం లేనటువంటి పాకిస్థాన్ భూభాగంలో ఉన్న భారత ప్రాంతంగా మారేది. ఉత్తర పాకిస్థాన్(బంగ్లాదేశ్)తో పాకిస్థాన్ ఎదుర్కొన్న పరిస్థితి లాగే ఉండేది.
Also Read: కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కోర్టు
చివరికి పాకిస్థాన్‌కు అమ్మేశారు
అలాగే పాకిస్థాన్ చేసే దాడుల నుంచి భారత్ గ్వాదర్ ప్రాంతాన్ని రక్షించుకోలేదనే వాదనలు కూడా వచ్చాయి. నెహ్రూ.. పాకిస్థాన్‌తో స్నేహపూర్వక బంధాన్ని ఏర్పరుచుకొని.. గ్వాదర్ కొనుగోలు చేయడం అనేది కూడా ఓ అర్థం లేని రెచ్చగొట్టే చర్యగా భావించవచ్చు. 1956లో ఒమాన్ సుల్తాన్ నుంచి భారత్‌కు ఈ ఆఫర్ వచ్చింది. దీన్ని నెహ్రూ తిరస్కరించడంతో.. 1958లో ఒమాన్ సుల్తాన్ పాకిస్థాన్‌కు 3 మిలియన్ల పౌండ్లకు అమ్మేశారు.అయితే 65 ఏళ్ల తర్వాత ఒమాన్ సుల్తాన్ నుంచి వచ్చిన ఇంతటి విలువైన ఆఫర్‌ను తిరస్కరించడం అనేది దౌత్యపరంగా జరిగిన తప్పుగా కనిపిస్తోదని ప్రమిత్ పాల్ చౌదరీ అన్నారు.