Gutha Sukender Reddy: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి (Congress Party) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. అయితే.. తాజాగా ఆ లిస్ట్ లోకి శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు కూడాచేరింది. ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
ALSO READ: వచ్చే నెల నుంచి ఫ్రీ కరెంట్.. మంత్రి కీలక ప్రకటన
అంతే దూరంలో ఉన్నాను..
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని వస్తున్న వార్తలపై స్పందించారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఎంత దూరంలో ఉన్నానో... ఇప్పుడు కూడా అంతే దూరంలో ఉన్నానని అన్నారు. తనకు ఇంకా నాలుగు సంవత్సరాలు పదవీ కాలం ఉందని.. అప్పటి వరకు మండలి చైర్మన్‌గా ఉంటానని తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిగా లేనని వెల్లడించారు.
ఎంపీగా గుత్తా కొడుకు..
మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డిని రాజకీయాల్లోకి దించాలనుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కోసం కేసీఆర్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. నల్గొండ నుంచి తన కుమారుడిని ఎంపీగా బరిలో దించాలని గుత్తా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖమ్మం, నల్గొండ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
జగదీశ్వర్ రెడ్డితో కొట్లాట..
బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో ఉన్న విబేధాలపైనా స్పందించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. తన కథ వేరు, జగదీశ్వర్ రెడ్డి కథ వేరు అని అన్నారు. మంచి పనులు చేసిన మంత్రులు ఓడిపోయారని మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
BRS క్యాడర్‌ను కాపాడుకోవాలి..
BRS క్యాడర్‌ను కాపాడుకోవడమే ఇప్పుడు అతిపెద్ద సమస్య అని సంచలన వ్యాఖ్యలు చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో BRS పార్టీ ఓటమికి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలు కారణం అని అన్నారు. తెలంగాణలో అయోధ్య ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని అన్నారు.
ALSO READ: సీఎం జగన్ కు మరో షాక్ తగలనుందా?
DO WATCH: