BRS Party: కాంగ్రెస్‌లో చేరడంపై బీఆర్ఎస్ నేత కీలక వ్యాఖ్యలు
తాను కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఎంత దూరంలో ఉన్నానో... ఇప్పుడు కూడా అంతే దూరంలో ఉన్నానని అన్నారు.