khalisthan:భారత్ తో పెట్టుకుంటే దెబ్బ మామూలుగా ఉండదు...

ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఛీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇండియాలో అతని ఆస్తులను జప్తు చేసింది.

khalisthan:భారత్ తో పెట్టుకుంటే దెబ్బ మామూలుగా ఉండదు...
New Update

భారత్-కెనడాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇండియాకు కెనడాతో ఉన్న సంబంధాలు దాదాపుగా తెగిపోతున్నాయి. కెనడా ప్రధాని ట్రుడో ఖలిస్థాన్ ఉగ్రవాది విషయంలో చేసిన ఆరోపణలను భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కెనడాలోని హిందువులంతా ఇండియాకు వెళ్ళిపోవాలని ఖలీస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వార్నింగ్ ను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అందుకే అమృత్ సర్ జిల్లా ఖాన్ కోట్ లో ఉన్న అతని వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్ లో ఉన్న ఇల్లును ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇక మీదట అవి ప్రభుత్వానివి అని ప్రకటించింది.

నిజానికి గురపత్వంత్ సింగ్ పేరిట ఉన్న ఆస్తులను 2020లోనే అటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూప్ ద్వారా అతను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయింది. మరోవైపు గురుపత్వంత్ మీద పంజాబ్ లో 22 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అందులో మూడు దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయి.

gurupatwanth, NIA

కెనడాలో ఉంటున్న గురుపత్వంత్ ను ఉగ్రవాది అని భారత ప్రభుత్వం 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్ పోల్ కు రెడ్ నోటీస్ సైతం విజ్ఞప్తి చేసింది. కానీ సరైన సమాచారం లేదనే కారణంగా ఇంటర్ పోల్ దానిని తోసిపుచ్చింది. అప్పటి నుంచి గురుపత్వంత్ గురించి ఇండియా...కెనడాను హెచ్చరిస్తూనే ఉంది. కానీ ఆ దేశం మాత్రం సరిగ్గా స్పందించలేదు.

భారత్ కే మా సపోర్ట్...

మరోవైపు కెనడా-భారత్ ల మధ్య ఉద్రిక్తతల మద మిత్ర దేశం అమెరికా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. మొదటి నుంచి కెనడా ప్రధాని ట్రుడో చేసిన ఆరోపణలను అమెరికా ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం గురించి మాట్లాడుతూ...రెండు దేశాలు తమకు ముఖ్యమైనవే అయినా..ఒకవైపే నిలబడాల్సి వస్తే భారత్ వైపే ఉంటామని తేల్చి చెప్పారు వైట్ హౌస్ అధికారులు. భారత్ లాంటి బలమైన దేశాన్ని సవాలు చేయడం అంత మంచి విషయం కాదని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

#gurupatwanth-singh #properties #nia #canada #seize #khalisthan #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe