నాకు ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటున్న హీరోయిన్‌..ఇంతకీ ఎవరంటే

గుంటూరు కారం సినిమా లో రెండో హీరోయిన్ గా నటిస్తున్న మీనాక్షి చౌదరి...సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన తనకి ఎంతో ప్రత్యేకమైన వారంటూ పేర్కొంది.

New Update
నాకు ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటున్న హీరోయిన్‌..ఇంతకీ ఎవరంటే

త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కి సంబంధించిన షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.డిసెంబర్‌ మూడో వారానికి అంతా షూటింగ్‌ మొత్తం పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కేరళలో జరుగుతుంది. ఇందులో మహేష్‌ బాబు, శ్రీలీల పాల్గొంటున్నారు. కేరళ లో సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే సినిమాలో మిగిలిన చిన్నపాటి బ్యాలెన్స్‌ సన్నివేశాలను కూడా పూర్తి చేయనున్నట్లు సినిమా బృందం తెలిపింది. ఆ తరువాత ప్రమోషన్‌ కార్యక్రమాలు జరగనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్‌ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన మీనాక్షి గుంటూరు కారం చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సమయంలో మహేష్‌ బాబు గురించి మాట్లాడుతూ.. ఆయన ఓ ప్రత్యేకమైన వ్యక్తి అని అన్నారు.

సినిమా షూటింగ్‌ సెట్ లో ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎంతో గౌరవిస్తూ మాట్లాడతారని ఆమె పేర్కొంది. మొదటి రోజు గుంటూరు కారం సినిమా సెట్ లోకి వచ్చిన సమయంలో చాల టెన్షన్ పడినట్లు ఆమె తెలిపింది. ఆ సమయంలో ఫస్ట్‌ షాట్ మహేష్‌ బాబుతో చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నేను చాలా టెన్షన్‌ పడుతు ఉన్నాను.

దానిని గమనించిన మహేష్‌ పర్లేదు టైం తీసుకుని చేయండి అంటూ నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేశారు. మహేష్‌ ఓ ఫ్యామిలీ పర్సన్‌. ఆయనతో వర్క్ చేయడం చాలా సరదాగా అనిపించింది. అభిమానులందరూ మహేష్‌ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారని తెలుసు.

చాలా కాలం తరువాత గ్యాప్ తీసుకుని వస్తున్న మహేష్‌ చిత్రం కావడంతో ఈ సినిమా అభిమానులకు నచ్చేటట్లు ఉంటుందని మీనాక్షి చౌదరి వెల్లడించారు. మహేష్‌ త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ఇది. అతడు, ఖలేజా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాదాపు 12 సంవత్సరాల తువాత వీరిద్దరి కాంబినేషన్‌ లో సినిమా రాబోతుంది.

దాంతో అభిమానులు ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. పైగా ఈ సినిమాలో మహేష్ పూర్తిగా మాస్ తరహాలో కనిపిస్తూ ఉండటంతో.. రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.

Also read: సోనియా పుట్టిన రోజు తెలంగాణ ప్రజలకు ఓ పండుగ!

Advertisment
తాజా కథనాలు