Gulam Nabi Azad Sensational Comments: కశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ(డీపీఏపీ) చీఫ్ గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలోని మెజార్టీ ముస్లింలు గతంలో హిందువులేనని అన్నారు. ముస్లింలలో అత్యధికులు హిందూ మతం నుంచి మారి వచ్చేనన్నారు. దీనికి సంబంధించిన ఉదాహరణలు కశ్మీర్ లో చాలా కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
దోడా జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.... ముస్లింలు బయటి దేశాల నుంచి భారత్ కు వచ్చారని కొందరు లేదని మరి కొందరు బీజేపీ నేతలు అంటున్నారని ఆయన చెప్పారు. అసలు ఎవరూ బయటి నుంచి లేదా లోపలి నుంచి కానీ రాలేదన్నారు. ఇస్లాం కన్నా హిందూ మతం పురాతనమైనదన్నారు. కేవలం 10 నుంచి 20 శాతం మంది మాత్రమే బయటి దేశాల నుంచి వచ్చారని పేర్కొన్నారు. మిగతా వారంతా హిందూ మతం నుంచి మారిన వారేనన్నారు.
600 ఏండ్ల క్రితం కశ్మీర్ లో మస్లింలు ఎక్కడ వున్నారని ఆయన ప్రశ్నించారు. వారంతా కశ్మీర్ పండిట్ లేనన్నారు. వాళ్లే మతం మారి ఇస్లాంలోకి వచ్చారన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ, భజ్ రంగ్ దళ్, వీహెచ్ పీ నేతలు స్వాగతిస్తున్నారు. ఇక మిగతా పార్టీ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ముస్లిం మత సంస్థలు ఆయనపై విరుచుకుపడుతున్నాయి.
ఆజాద్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్న బీజేపీ నేతలు...!
గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కవిందర్ గుప్తా స్వాగతించారు. ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. ఈ దేశంపై ముస్లిం పాలకులు దండెత్తి వచ్చే వరకు అందరూ హిందుత్వాన్ని పాటించిన వారేనన్నారు. ఈ విషయాన్ని తమ పార్టీ ఎఫ్పటి నుంచో చెబుతోందని ఆయన అన్నారు.
గులాంనబీపై మెహూబా ముఫ్తీ ఫైర్...!
గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఫైర్ అయ్యారు. గులాం నబీ ఆజాద్ చరిత్రలో ఎంత కాలం వరకు వెనక్కి వెళ్లారో తనకు తెలియదన్నారు. ఆయనకు తన పూర్వీకుల గురించి ఎంత వరకు పరిజ్ఞానం ఉందో తెలియదన్నారు. ఆయన చరిత్రలో మరింత కొంత కాలం వెనక్కి వెళ్లి వుండాల్సిందన్నారు. బహుశా అప్పుు ఆయన పూర్వీకుల్లో కోతులు కనిపించి వుండేవి కావచ్చని ఎద్దేవా చేశారు.
ఆజాద్ వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా ఏమన్నారంటే...!
ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆయన ఏ సందర్బంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదన్నారు. ఎవరిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ వ్యాఖ్యలు చేశారో తెలియడం లేదన్నారు. ఇక ముస్లిం సంఘాలు గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బీజేపీ నేతల ప్రశంసలు పొందేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
Also Read: లాలూకు భారీ షాక్.. బెయిల్ పిటిషన్ ను సవాల్ చేసిన సీబీఐ…!