Heavy Rains : భారీ వర్షాలకు (Heavy Rains) గుజరాత్ అతలాకుతలం అయింది. రెండురోజులుగా ఏకధాటిగా కుండపోత వానలు కురుస్తుండడంతో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అహ్మదాబాద్‌లోని ప్రధాన రోడ్లపైకి వరద నీరు చేరింది. అప్రమత్తమైన సిబ్బంది నీటిని తొలగిస్తున్నారు. ప్రధాన రోడ్లపై చెట్లు నేలకూలాయి. ఘట్లోడియాలోని చాలా ప్రాంతాల ప్రజలు నిత్యావసరాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: కువైట్‌లో చిక్కుకున్న మరో తెలుగు మహిళ.. !
వల్సాద్, తాపి, నవ్సారి, సూరత్, నర్మదా, పంచమహల్ జిల్లాలపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆరావళి, ఉప్పర్వాలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు నీట మునిగాయి. అజ్వా సరోవరం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. సరోవర్ డ్యామ్ నిండుకుండలా కనిపిస్తోంది. వడోదరలో 33 అడుగులకు విశ్వామిత్రి నది నీటిమట్టం చేరింది. కాలా ఘోడా బ్రిడ్జిని అధికారులు మూసి వేసినట్లు తెలుస్తోంది.
Also Read: సంచలనం సృష్టిస్తున్న ముంబైనటి వేధింపుల వ్యవహారం..తెర వెనుక కీలక నేత
భారీ వర్షాలతో పలు రైళ్లు సైతం రద్దు అయ్యాయి. భారీ వర్షాలపై కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) ఆరా తీశారు. వరద బాధితులకు అండగా ఉంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మరో రెండు రోజులపాటు వర్షాలు ఉన్నాయని గుజరాత్ (Gujarat) లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.