Gujarat: సూరత్‌ ఎంపీగా బీజేపీ అభ్యర్థి..పోటీయే లేదు

సూరత్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ముఖేష్ దలాల్‌ విజయం ఖరారు అయిపోయింది. అక్కడి కాంగ్రెస్ అభ్యర్ధి నీలేష్ కుంభానీతో పాటూ ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ముఖేష్ దలాల్‌ విజయం సాధించనట్లు అయింది.

New Update
Gujarat: సూరత్‌ ఎంపీగా బీజేపీ అభ్యర్థి..పోటీయే లేదు

BJP candidate Mukesh Dalal: సూరత్‌లో లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది. ఈ స్థానానికి బీజేపీ నుంచి ముఖేశ్ దలాల్, కాంగ్రెస్ నుంచి నీలేష్ కుభానీలు పోటీలో ఉ్నారు. నామినేషన్లు కూడా వేశారు. అయితే ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈయనతో పాటూ అక్కడి ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్ధి ముకేష్‌కు పోటీయే లేకుండా అయిపోయింది. దీని వలన ఇక్కడ ఎన్నిక జరగకుండానే ముఖేష్ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు అయింది.

ఎన్నికలు అవకుండానే వజ్రాల నగరం సూరత్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. సూరత్ లోక్‌సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ అపూర్వమైన విజయాన్ని దక్కించుకుంది. ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరిగాయి కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఇది అరుదనే చెప్పవచ్చును. దీంతో ఇప్పుడు సూరల్ ఎంపీ ఎన్నిక టాక్‌ ఆఫ్ ద పాలిటిక్స్‌గా నిలిచింది. దాంతో పాటూ ముఖేష్ దలాల్ పేరు కూడా రాజకీయ చరిత్రలో నిలిచిపోనుంది. సూరత్‌లో మరో అభ్యర్థి ఎవరూ కూడా పోటీకి లేరని తెలుస్తోంది. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ముఖేశ్‌ నే ఎంపీగా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది.

1989లో చివరిసారిగా...

ఇప్పుడు బీజీపీ అభ్యర్థి ముఖేష్‌ కన్నా ముందు 1989లో మొహ్మద్ షపీ ఇది అరుదైన ఘనతను సాధించారు. ఈయన కూడా అప్పట్లో ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికలయ్యారు.

Also Read: Jerusalem: ఇజ్రాయెల్‌పై టెర్రర్ అటాక్

Advertisment
తాజా కథనాలు