APPSC Group-2: మొరాయిస్తున్న ఏపీపీఎస్సీ సర్వర్.. గ్రూప్-2 దరఖాస్తు గడువు పొడిగింపు?

ఏపీలో 899 గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రేపటికి (జనవరి 10) గడువు ముగియనుంది. ఇప్పుడు అప్లై చేసుకోంటున్న అభ్యర్థులకు సర్వర్ డౌన్ అని చూపించడంతో తాము దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. గడువు తేదిని పొడగించాలని ఏపీపీఎస్సీని కోరుతున్నారు.

APPSC Group-2: మొరాయిస్తున్న ఏపీపీఎస్సీ సర్వర్.. గ్రూప్-2 దరఖాస్తు గడువు పొడిగింపు?
New Update

Group-2: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 899 గ్రూప్‌-2 ఉద్యోగాలకు డిసెంబర్ 7న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అయితే దరఖాస్తులు చేసుకునేందుకు రేపటితో (జనవరి 10) గడువు ముగియనుంది. కానీ ఇప్పుడు అప్లై చేసుకోంటున్న అభ్యర్థులకు సర్వర్ డౌన్ అని చూపించడంతో తాము దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. గడువు తేదిని పొడగించాలని కోరుతున్నారు. ఇందుకోసం ఏపీపీఎస్సీని వినతులు చేస్తున్నారు. అయితే ఏపీపీఎస్సీ సైతం గ్రూప్-2 దరఖాస్తును పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు రాత్రి లేదా రేపు మధ్యాహ్నంలోగా ఈ మేరకు ఏపీపీఎస్సీ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు గడువు పొడిగింపు కోసం వేచి చూడకుండా.. ముందు జాగ్రత్తగా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోడానికి ప్రయత్నించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 899 గ్రూప్‌-2 ఉద్యోగాలకు డిసెంబర్ 7న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అయితే దరఖాస్తులు చేసుకునేందుకు రేపటితో (జనవరి 10) గడువు ముగియనుంది. కానీ ఇప్పుడు అప్లే చేసుకోంటున్న అభ్యర్థులకు సర్వర్ డౌన్ అని చూపించడంతో తాము దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. గడువు తేదిని పొడగించాలని కోరుతున్నారు. ఇందుకోసం ఏపీపీఎస్సీని వినతులు చేస్తున్నారు.

Also Read: కాళేశ్వరంలో ‘మేఘా’ అవినీతి రూ.50 వేల కోట్లు.. కాగ్ నివేదికలో సంచలన లెక్కలు!

ఇప్పటికే ఏపీపీఎస్సీ.. గ్రూప్-2 రాత పరీక్షల కోసం కొత్త సిలబస్ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు రెండు దశల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి దశలో 150 మార్కులకు ప్రిలిమినరీ (స్క్రీనింగ్) పరీక్ష ఉంటుంది. ఇక రెండో దశలో 300 మార్కులకు మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది. అయితే.. తాజా సిలబస్‌ ప్రకారం చూసుకుంటే.. ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం అనే అంశాన్ని చేర్చారు. సవరించిన సిలబస్, పరీక్ష విధానం ప్రకారం.. 150 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్విహించనున్నారు.

అయితే స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు రానున్నాయి. ఇక మెయిన్స్‌లో రెండు పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులకు (మొత్తం 300) ఉంటుంది. పేపర్-1లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ అలాగే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి.

Also read: బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీర్పు బీజేపీకి చెంపపెట్టు: ఉత్తమ్

Also Read: సంక్రాంతి పండక్కి మరో 6 ప్రత్యేక రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే..

#group-2 #appsc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe