Andhra Pradesh: అలర్ట్..గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష వాయిదా

ఏపీలో త్వరలో జరగనున్న గ్రూప్‌‌1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. అభ్యర్ధుల నుంచి వాయిదా కోసం విజ్ఞప్తులు రావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషన్ తెలిపింది.

APPSC Group-1: నేడే గ్రూప్-1 ఎగ్జామ్.. అరగంట ముందే ఎగ్జామ్ హాల్ లోకి.. పూర్తి వివరాలివే!
New Update

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఎగ్జామ్ సెప్టెంబర్ 2 నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్ష ప్రిపరేషన్‌కు చాలా తక్కువ సమయం ఉందని..వాయిదా వేయాలని అభ్యర్ధుల నుంచి ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ గ్రూప్–1 మెయిన్స్ ను వాయిదా వేసింది. పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.

గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. దీనికి మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో పేపర్-1 పరీక్షకు 91,463 (72.55 %) మంది, పేపర్-2 కు 90,777 (72 %) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కు ఎంపిక చేస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 మెయిన్ పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 3 గంటలు కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో ఏపీపీఎస్సీ ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తోంది. వీటితో పాటు ల్యాంగేజ్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ కూడా ఉంటాయి. ఈ పేపర్లు కేవలం అభ్యర్థుల అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 ప్రధాన పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల ఉంటాయి. మొత్తం 750 మార్కులకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఉంటుంది. దీని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.

publive-image

Also Read: Andhra Pradesh: ఎసెన్షియా కంపెనీలో ప్రమాదం..16చేరిన మృతుల సంఖ్య

#andhra-paradesh #exam #appsc #group-1-mains
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe