Group-1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ ఏడాది మే 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. మెయిన్స్ ప్రశ్నపత్రాన్ని ట్యాబుల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పేర్కొన్నారు.