Group-1 : గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల ఎప్పుడంటే

జూన్ 9న టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 1 మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు, శాంపిల్ OMR షీట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

BIG BREAKING: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా?
New Update

Group-1 Hall Tickets : జూన్ 9న టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష (TGPSP Group-1 Preliminary Exam) నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 1 మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు, శాంపిల్ OMR షీట్లు అధికారిక Website లో అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేసిన అనంతరం మరిన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

Also Read: రాష్ట్ర చిహ్నం మార్పుపై రగడ.. బీఆర్‌ఎస్‌కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

ఇదిలా ఉండగా.. జూన్ 9న జరగబోయే ప్రిలిమ్స్ పరీక్ష కోసం.. టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏ చిన్న తప్పు కూడా జరగకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇక అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది కమిషన్.

Also read: తెలంగాణలో కులగణనకు సిద్ధం.. ఎప్పటినుంచంటే

#telangana #telugu-news #group-1 #hall-tickets
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి