Telangana: గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. ఈ రూల్స్ పాటించాల్సిందే తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయం 10.30 AM నుంచి మధ్యాహ్నం 1:00 PM వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 30 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TSPSC Group 1: తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయం 10.30 AM నుంచి మధ్యాహ్నం 1:00 PM వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే.. అంటే 10 గంటల తర్వాత గేట్లు మూసివేయబడతాయని చెప్పారు. జూన్ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి హాల్‌టికెట్లు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. బయోమెట్రిక్ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేయబోమని స్పష్టంచేశారు. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ 1. అభ్యర్థులకు ఓఎంఆర్ షీట్లు ఇస్తారు. అందులో ఉన్న సూచనల ప్రకారం.. వివరాలు రాయాలి. బబ్లింగ్ చేయాలి. 2. పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులకు సౌకర్యార్థం ప్రతి అరగంటకు బెల్ మోగించి సమయాన్ని తెలియజేస్తారు. 3. బయోమెట్రిక్‌ను పరీక్ష కేంద్రంలో ఉదయం 9.30 AM గంటల నుంచి ప్రారంభిస్తారు. 4. పరీక్షకు వచ్చే అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకొని రావాలి. బూట్లు ధరించేందుకు పర్మిషన్ లేదు. 5. పరీక్ష సమయం ముగిసేవరకు అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదు. పరీక్ష అయిపోయిన తర్వాత ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 1202 ఖాళీలకు నోటిఫికేషన్! #telugu-news #group-1 #national-news #tspsc-group-1 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి