లోక్‌సభ ఎన్నికలు జరుగున్న వేళ.. పెళ్లి పత్రికల్లో ప్రధాని మోదీ పేరు ప్రస్తావించిన పెళ్లి కొడుకుకు చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ఎన్నికల కోడ్‌ను పర్యవేక్షిస్తున్న అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఓ యువకుడు తన పెళ్లి పత్రికలో.. ' ప్రధానమంత్రిగా మోదీని మరోసారి గెలిపించడమే మా జంటకు మీరు ఇచ్చే గొప్ప బహుమతి అని రాయించుకున్నాడు.
Also Read: టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. హైదరాబాద్-విజయవాడ రూట్ ప్రయాణికులకు భారీ ఆఫర్!
దీన్ని గమనించిన అతడి బంధువొకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల అధికారులు ఏప్రిల్ 14న పుత్తూరు తాలుకాలో వరుడి ఇంటికి వెళ్లారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే మార్చి 1న ఆహ్వాన పత్రికలు ముద్రించానని అతడు సమాధానమిచ్చాడు. అయినాకూడా అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: ఘోర ప్రమాదం..పెళ్లి ఊరేగింపు పై పడిన ట్రక్కు.. 6 గురు మృతి!