Trending Video : వైరల్‌గా మారిన బరాత్‌ వీడియో... పెళ్లికి వరుడు ఎలా వచ్చాడో చూడండి..!

ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'యూలు'పై బెంగళూరు వీధిల్లో చక్కర్లు కొడుతూ పెళ్లి మండపానికి చేరుకున్నాడు వరుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పర్యావరణ స్పృహతో ఇలా చేసిన వరుడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

New Update
Trending Video : వైరల్‌గా మారిన బరాత్‌ వీడియో... పెళ్లికి వరుడు ఎలా వచ్చాడో చూడండి..!

Baraat : పెళ్లి(Marriage) బరాత్‌ అంటే అలా ఇలా ఉండదు.. ముఖ్యంగా తెలంగాణ(Telangana) లో చెవులు చిల్లులు పడేలా ఉంటుంది. పెద్ద పెద్ద సౌండ్లతో, డీజే పాటలతో, అదిరే స్టెప్పులతో దుమ్ములేపుతారు. ఇలా చేయకుండా పెళ్లి మండపానికి వచ్చేవారు చాలా తక్కువ. కళ్యాణ మండపానికి చేరుకునేటప్పుడు నిర్వహించే ఊరేగింపునే బరాత్ అంటారని తెలిసిందే. అటు ఈ బరాత్‌ ట్రెడిషన్‌ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉంటుంది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటక(Karnataka) లోనూ ఈ కల్చర్‌ ఉంది. అయితే ఈ బరాత్‌ వల్ల శబ్ద కాలుష్యం, వాహన కాలుష్యం పెరుగుతుందని.. పెద్ద పెద్ద సౌండ్లకు కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయ్‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్నింగ్‌ని మైండ్‌లో పెట్టుకున్నాడో ఏమో.. బెంగళూరు(Bangalore) కు చెందిన వరుడు వెరైటీగా పెళ్లిమండపానికి చేరుకున్నాడు.


ఎలా వచ్చాడంటే?
సంప్రదాయ భారతీయ వివాహ ఊరేగింపులకు ట్విస్ట్ ఇస్తూ, బెంగళూరులోని ఒక వరుడు ఎలక్ట్రిక్ స్కూటర్ పై తన వివాహ వేదికకు వచ్చి ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించాడు. 'యూలు'(Yulu) బైక్లపై బెంగళూరు వీధుల్లో వెళ్లాడు. పెళ్లి 'బరాత్'(Baraat) ఇలానే కొనసాగింది. ఈ ఎకో ఫ్రెండ్లీ(Eco Friendly) స్కూటర్లపై నగరాన్ని చుట్టేశాడు. ఈ అసాధారణ రాక అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాంప్రదాయంగా గుర్రం లేదా కారుతో వరుడు పెళ్లి వేదికకు చేరుకుంటాడని తెలిసిందే. 'యూలూ బైక్‌పై బరాత్' అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

భిన్నాభిప్రాయాలు:
ఈ వీడియోకు 42 వేలకు పైగా లైకులు రావడంతో పాటు రియాక్షన్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వినూత్న వివాహ ఆలోచనలకు తమ మద్దతును వ్యక్తం చేస్తూ, ప్రత్యేకమైన పర్యావరణ స్పృహ కలిగిన ఎంపికను చాలా మంది ప్రశంసించారు. అయితే, ట్రాఫిక్ అంతరాయాల గురించి కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: ‘పర్ఫెక్ట్ కిస్’ ఎన్ని సెకన్లు ఉంటుంది..? పురుషులు ఎక్కువగా ఏ ముద్దును ఇష్టపడతారు!

WATCH:

Advertisment
తాజా కథనాలు